Jump to content

పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గున్ను, హలః = వ్యంజనములు, చతుస్త్రింశత్ = ముప్పదినాలుగు, అచ్చులు పదహాఱు, హల్లులు ముప్పదినాలుగున్ను - ఉభయములున్ను గూడంగా నేఁబది వర్ణము లాయెను.

తే.

అచ్చు లొకపదియాఱును వ్యంజనములు
పాండుపుత్రసహాయ ముప్పదియు మూఁడు
దొడ్డళా యందులోపల దొరల నయ్యె
నమరభాషకు నేఁబది యక్షరములు.

49


సీ.

ఏకనీళము దేవహేళనంబు నటంచు యాజుషామ్నాయంబునందు లేదో
కాళవాళవ్యాళగోళహింతాళంబు లనుచు సంస్కృతభాషయందు లేదొ
గయ్యాళి త్రుళ్లు [1]నంగళ్లు వజ్రపుతళ్కు తాళి యటంచు నాంధ్రమున లేదొ
పాళం బెఱుంగని కూళ నివాళి పిసాళించు ననుచు దేశ్యముఁన లేదొ


తే.

యాగమజ్ఞులు దొడ్డుబీజాక్షరంబు, లందు లేకున్కి సన్నంబు నదియుఁ గూడ
నొకటిగాఁ జేసి బీజోపయోగి గాన, క్షాను జేకొని రది శబ్దసరణి గాదు.

50


వ.

ఆగమజ్ఞులు పంచాశద్వర్ణంబులలో నున్న క్షకారమును కూడుకొన్నందునకు మహావిద్యలోని శ్లోకంబులు—

51


శ్లో.

మూలాధారం గుదస్థానం స్వాధిష్ఠానం తు మేహనమ్
నాభిస్తు మణిపూరాఖ్యం హృదయాబ్ద మనాహతమ్,
తాలుమూలం విశుద్ధాఖ్య మాజ్ఞాఖ్యం నిటలాంబుజమ్
సహస్రారం బ్రహ్మరంధ్ర మిత్యాగమనిదో విదుః.


శ్లో.

ఆధార స్తు చతుర్దళో౽రుణరుచి ర్వాసాంతవర్ణాశ్రయః
స్వాధిష్ఠాన మనేకవైద్యుతనిభం బాలాంతషట్పత్రకమ్,
రత్నాభం మణిపూరకం దశదళం డాద్యం ఫకారాంతకం
పత్త్రైర్ద్వాదశభి స్త్వనాహతపురీ హైమీ కఠాంతాన్వితా.


శ్లో.

ద్వ్యష్టారం స్వరషోడశైశ్చ సహితం జ్వోతిర్విశుద్ధాంబుజం
హం క్షేత్యక్షరపద్మపత్రయుగళం రత్నోపమాజ్ఞాపురీ,
తస్మా దూర్ధ్వ మధోముఖం వికసితం పద్మం సహస్రచ్ఛదం
నిత్యానందమయీ సదాశివపురీ శక్త్యై నమ శ్శాశ్వతమ్.


తే.

కాకు షా జడ్డ యైన క్షకార మగుట, దలఁప కేఁబదిలిపులలో దాని గూర్చి
తొలుత భిన్నాక్షరంబైన దొడ్డళాను, విడిచి పెట్టె ననంతుండు వెఱ్ఱి గాఁడె.

52


వ.

ఛందమునందు ననంతుఁడు చెప్పిన విధము.

53
  1. నగళ్లు (సూ)