Jump to content

పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

నిడుదలు నెఱయక్కరములు, పొడవులు చాఁపులును దీర్ఘములు నన నొకకై
వడి వ్రాలు కుఱచ లలరును, గిడిసులు గుజ్జులు ననంగ క్షితి హ్రస్వలిపుల్.

10


క.

సున్న యన బొ ట్టనంగా, నెన్న ననుస్వారసంజ్ఞ [1]లిల వలపల రెం
డున్నవి విసర్గ మనఁ జనుఁ, బన్నగపతిశయన ధవళపంకజనయనా.

11


ఆ.

గజడబలు మొదలుగా వర్గవర్గంలు, నందు మూఁడు మూఁడు హా యొకండు
యాదిలిపులు నాల్గు నన్యవర్ణయుతంబు, లైన శసలు ఘోష లనఁగఁ దనరు.

12


తే.

ఒత్తు జడ్డయు ద్విత్వసంయుక్తములును, మహిని సంయోగవర్ణనామంబు లయ్యెఁ
బై స్వరము లేక కడుఁ దేలఁబలుకఁబడిన, వ్యంజనంబులు పొల్లు లనం జెలంగు.

13


మూ.సూ.

ప్రాణ స్సమాసతోఽచో బిన్దు రనుస్వార ఏ జథో వక్రః
వక్రతమ ఐజ్ఝల స్స్యు స్సమాసతః ప్రాణినో ద్రుతాఖ్యో నః,
కచటతపాః పరుషాఖ్యా గజడదబా సరళా స్స్థిరా ఇతరే,
ఏతా స్పృజ్ఞా స్సర్వా జ్ఞాత్వా పశ్చా త్ప్రవర్తయే దత్ర.

1


సీ.

అచ్చులు ప్రాణంబు లని చెప్పఁబడు ననుస్వారంబు బిందుప్రశస్తి గాంచు
నేత్వంబు నోత్వంబు నెసఁగు వక్రము లన వానిమీఁదీని రెండు వక్రతమము
లిలఁ బ్రాణు లనుపేర నేపారు హల్లులు ద్రుత మనంగ నకార మతిశయిల్లు
వర్గాదులను గల వర్ణంబు లైదును బరుషనామంబులై ప్రణుతి కెక్కుఁ


తే.

బంచవర్గతృతీయముల్ పరమపురుష, సరళముల్ శేషహల్లులు స్థిరము లయ్యె
శబ్దశాస్త్రంబు గాన నీసంజ్ఞ లెల్లఁ, దెలిసి యీగ్రంథమునఁ బ్రవర్తించు టొప్పు.

14

వర్ణోత్పత్తిస్థానంబులు

క.

ఇమ్మహి ద్విస్థానోన్బూ, తమ్ములు వక్రయమవక్రతమయుగ్మవకా
రమ్ములు మఱి యేకస్థల, జమ్ము లితరవర్ణములు భుజంగశయానా.

15


సీ.

ఉదయించు నత్వంబు మొదలుగా రెండు రెండచ్చులు పరుసతో నఱుతఁ దాలు
పుల నోష్ఠముల నవుదల దంతములఁ గంఠతాలువుల గళోష్ఠతలములందు
బొట్టు నాసను గళంబున విసర్గంబును గాదివర్ణము లైదు నైదు గూడి
తగ గంఠతాలుమస్తకరదోష్ఠముల నంతస్థము ల్తాలుమస్తకరదముల


తే.

నూర్థ్వదంతాధరంబుల నూష్మలిపులు, క్రమతఁ దాలుశిరోదంతకంఠములను
బలువువ్రాయి శిరంబున బండిరాకు, స్థానభేదంబు లేదు దంతములఁ జజలు.

16


వ.

బలువువ్రాయి యనఁగా దొడ్డళకార మనుట.

17
  1. లీవలపల (సూ)