| క. |
తొల్లింటిజనులవాక్యము, లెల్లను బ్రాఁదెనుఁగు లయ్యె నిప్పటివారల్
చెల్లుబడి నాడునవియే, [1]దెల్లమిగా నింకఁ బ్రాఁతతెలుఁగులఁ నృహరీ.
| 113
|
| క. |
పుడమియు సిరియును బడఁతులు, వెడవిలుతుఁడు పసిఁడికడుపువేల్పును గొడుకుల్
గడలి విడిమనట్టు పాపల, నడుచు [2]గుఱముసామి కనఁగ నచ్చతెనుంగుల్.
| 114
|
పూర్వకవిసమయసిద్ధపదంబులు
| మూ.సూ. |
సిద్ధిర్లోకాద్దృశ్యా లోకోఽనన్యాదృశశ్చ నిత్యశ్చ.
| 12
|
| క. |
కవులకు దేశ్యము లోక, వ్యవహారమువలనఁ దెలియనగు నా లోక
వ్యవహారము నిత్యంబును, భువి నిజదేశమున యోగ్యమును నగుఁ గృష్ణా.
| 115
|
| తే. |
అవనియందు లోకవ్యవహార మనఁగ, నాత్మదేశంబులను బెద్ద లైనవార
లాడు భాషావిశేషవాక్యములలోన, [3]వాడుకకు వచ్చునవి దుగ్ధవార్ధిశయన.
| 116
|
| సీ. |
మదిరాక్షిచెవులు తొమ్మిదిలెక్క లనరాదు ముద్దియకనులు తమ్ము లనరాదు
శుకవాణిబుగ్గలు ముకురంబు లనరాదు చెలిపండ్లు మల్లెమొగ్గ లనరాదు
గజయానచండ్లు బంగరుకుండ లనరాదు సతిబొడ్డు సుడిని మెచ్చ దనరాదు
సరసిజాననముడ్డి సైకతం బనరాదు హరిమధ్యకా ళ్ళిగు ళ్లనఁగరాదు
|
|
| తే. |
క్రమత వీనికి వీనులు కన్నుదోయి
చెక్కులును బలువరుసలు నిక్కుఁజన్నుఁ
గవయుఁ బొక్కిలి పిఱుఁదు చొక్కంపుటడుగు
లనుచు మును వాడి రవియ చేకొనఁగవలయు.
| 118
|
| తే. |
రణము [4]వర్ణించుచో వీరరసమునందు
యుద్ధపంచకమునఁ దిక్కయొజ్జ సారెఁ
గా ళ్లటంచు రచించుట గాంచి కవులు
చెప్పుకొనిరి మీఁగాళ్లని చెలఁగి కృతుల.
| 119
|
సారంగధరచరిత్రమునందు సీసపాదము (1.120)
| సీ. |
ఉమ్మెత్తపువ్వు నా [5]నొరపైనకుచ్చిళ్లు [6]చెలఁగి మీఁగాళ్లపైఁ జిందులాడ
|
|
- ↑ దెల్లమిగా నెంతఁ బ్రాఁతతెనుఁగులు నృహరీ (నా); దెల్లమిగా వింక బ్రాఁతతెనుఁగులకు హరీ (ప)
- ↑ గుతురు (పె)
- ↑ వాడికకు (ప,వా,పె)
- ↑ వర్ణింపుచో (వా)
- ↑ నొకటై (ప), నొరవైన (పె)
- ↑ చెలికి (ప,వా,పె)