Jump to content

పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సూ.

క్షః


వృ.

క్ష ఇత్యస్య జిహ్వామూలీయః స్యాత్.

టీ. క్ష ఇత్యస్య = క్ష అనేటటువంటి అక్షరమునకు, జిహ్వామూలీయః = జిహ్వామూలీయము, స్యాత్ = అగును. పాణినీయవ్యాకరణమునందు 'ఃక ఇతి జిహ్వామూలీయః' అన్నందుచేతను, జిహ్వామూలీయ మనఁగాను దాపలివిసర్గము గల [1]కకారమునకు బేరు గాన ఃక అనునదిరాఁగా జఃక యని నిలిచెను. మునుపు చెప్పిన అధోక్షజఫక్కికావచనమువలన తాజాక్షరము దంత్యాక్షర మాయెను. ఆంధ్రమునందు విసర్జనీయము లేదు గనక అది లోపమైతేను జక్క అని యుండె; అది తత్సమము చేస్తేను జక్కులు ఆయెను. ఇది మాగధీభాషనైన తద్భవము.

సీ.

కుక్క [2]గోలెం బోలి కూళ గుండము కంతి గుజ్జు కరాటంబు గజ్జి కట్టె
సిక చేఁత చిక్కంబు చిన్నె సింగము సెజ్జ లక్క లచ్చన సుద్ది లయ్య లాగు
ప్రోడ పొత్తము పోఁక పుడమి బన్నము బూది బీరంబు బికిరంబు పిట్టు పుటము
వదినె వెన్నుఁడు వంక వడుగు వీడెము వన్నె రక్కసి రవణంబు రిక్క పగ్గె


తే.

పీఁట దయ్యము తోరంబు పెట్టె మట్టి
బత్తి జతనంబు జాతర ముత్తియంబు
దాది కుప్పస మిటికె నిద్దంబు పెరిమె
యివము దెస డిగ్గి యనఁగఁ దద్భవము లయ్యె.

98

దీనికి వివరము — కుర్కురశబ్దమునకు కుక్క, గోళశబ్దమునకు గోలెము, [3]ఆలిశబ్దమునకు ఓలి, క్రూరశబ్దమునకు కూళ, కుండశబ్దమునకు గుండము, గ్రంథిశబ్దమునకు కంతి, కుబ్జశబ్దమునకు గుజ్జు, కరండశబ్దమునకు కరాటము, ఖర్జూశబ్దమునకు గజ్జి, కాష్ఠశబ్దమునకు కట్టె, శిఖాశబ్దమునకు సిక, చేష్టాశబ్దమునకు చేఁత, శిక్యశబ్దమునకు చిక్కము, చిహ్నశబ్దమునకు చిన్నె, సింహశబ్దమునకు సింగము, శయ్యకు సెజ్జ, లాక్షకు లక్క, లాంఛనకు లచ్చన, సూక్తికి సుద్ది, లంజకు లయ్య, లంఘకు లాగు, ప్రౌఢకు ప్రోడ, పుస్తకమునకు పొత్తము, పూగకు పోఁక, పృథివికి పుడమి, భగ్నమునకు బన్నము, భూతిక బూది, వీరశబ్దమునకు బీరము, భిక్షకు బికిరము, పిష్టమునకు పిట్టు, స్ఫుటకు పుటము, వధూనికి వదినె, విష్ణునకు వెన్నుఁడు, వక్రమునకు వంక, వటునకు వడుగు, వీటికి విడ్డెము, వర్ణమునకు వన్నె, రక్షశ్శబ్దమునకు రక్కసి, రమ్యకు రవణము, ఋక్షమునకు రిక్క, ప్రజ్ఞకు పగ్గె, విష్టరమునకు పీఁట, దైవమునకు దయ్యము, స్థూలమునకు తోరము - దూలము, పేటికి పెట్టి, మృత్తికకు మట్టి, భక్తికి బత్తి, యత్నశబ్దమునకు జతనము, యాత్రకు జాతర, మౌక్తికమునకు ముత్తి

  1. కకారమునకు దాపలనున్న యర్ధవిసర్గమునకు జిహ్వామూలీయ మని సంజ్ఞ కాని అట్టి కకారమునకు గాదు. (పూ.ము.)
  2. గోలెము బవి (సూ)
  3. అవి శబ్దమునకు బవి (సూ). బవిశబ్దము నిఘంటులలోఁ గానరాదు (రా).