| సీ. | [1]క్షపణకజైనాదికర్మహీనులకుకు భామాజకులకును బ్రాకృతంబు | |
| తే. | పతితచండాలయవనాదిపరమనీచ, జాతినరుల కపభ్రంశ మీతెలుంగు | 83 |
ప్రకృతివికృతిభేదంబులు
| మూ.సూ. | ఆద్యప్రకృతిఃప్రకృతిశ్చాద్యే[2]త్వేషాతయోర్భవేద్వికృతిః. | |
| తే. | క్రమమునను సంస్కృతప్రాకృతములు రెండుఁ | 84 |
తద్భవస్వరూపము
| మూ.సూ. | కేవలతయానుసర్పత్యుభే చ యేయం యథాతథా భాషా. | |
| తే. | ప్రకృతులను రెంట రెండు రూపముల నమరు | 85 |
| | |
దీని అర్థము: శబ్దశాస్త్రము లోకమునందు ప్రవర్తించు ప్రయోగములే మూలముగా కలది. ఇటన్నందుచేతను వ్యాకరణశాస్త్రము లోకవ్యవహారము ననుసరించే చెప్పుచున్నది అనుట. అటు గాన లోకవ్యవహారసిద్ధములైనను తద్భవములకు లక్షణము తెలియవలెను. అది యెట్లంటేను: తెలుఁగునకు ప్రాకృతభాష ప్రకృతి అనిపించుకొనును. ఆ ప్రాకృతమునకు సంస్కృతభాష ప్రకృతి అనిపించుకొనును. అటు గనక ప్రకృతు లంటేను సంస్కృతప్రాకృతముల రెంటికిన్ని పేరు. ఆరెంటియందున్న కొన్ని తద్భవములు, ప్రత్యేకమున్ను ఒక్కొక్కదానను ఒక్కొక్కవిధమున పుట్టి రెండు రూపములనున్ను తెనుఁగులలోనూ గలసి యున్నవి. కనుక వాటి కన్నింటికిన్ని తెలిసేటట్టుగాను అందులోపల నొక చంద్రశబ్ధమునకు చెప్పుచున్నాము. సంస్కృతము