మర్జునచ్చవి కుంజరాననుచేరువఁ గరుణాభియాతి శృంగారభవము
సొంపొందు మధురతాసుప్రసాదములకు భారతీవృత్తిని బద్యములను
మూఁడుభేదంబులు మొలచె నుత్తమమధ్యమాధమంబు లనంగ నందులోన
సంసితన్మీతము లుత్తమాఖ్యలు గహసితప్రహసితంబులు మధ్యభావితములు
క్షితి నపహసితంబు నతిహసితంబును జనుఁ గావ్యములఁ గనినను బ్రశస్తిఁ
బంచమభావసంభవమహాక్రోధంబు రౌద్రరూపము దాల్చె రక్తనిభము
హరుని[1]యూడిగ మదర్వాన్వయప్రభపంబు భ్రుకుటిప్రయుక్త మద్భుకవిపంథి
యుద్ధ్భతార్థము ప్రసాద్రౌజంబులను గూర్చి యారభటీవృత్తి నమరఁ జెప్ప
[2]వెనుకఁ జెప్పిన[3]శోకమున కయ్యెఁ గరుణ దా మహి నథర్వామ్నాయవిహిత[4]కులజ
సమవర్తిదాసి కాషాయసన్నిభకాంతి హాస్యాద కార్ద్రరసాత్మజాత
సౌకుమార్యమునఁ బ్రసాదమాధుర్యంబులను గైశికీవృత్తిఁ జను రచింప
స్థాయీభావోదితోత్సాహంబు దా వీరరస మయ్యె [5]నెఱుపు సాధ్వసవిరోధి
కించిత్ప్రగల్భితోదంచితమోజఃప్రసాదసాత్వతులను జరగుఁ గవిత
ప్రథమవేది సుపర్వభర్తరాణువ మూఁడువిధములై యది ధాత్రి వెలయు నమర
వారంబు వితరణవీరంబు గారుణ్యవీర్యంబు నన భావవేద్య మగుచు
విస్మయాహ్వయమున వెలయుభావంబు విభావాదులచే నద్భుతాభిదాన
మున నొప్పు నాశ్వలాయనసూత్రజము కమలాసమ[6]దళవాయి యరుణకాంతి
రౌద్రరసాదివీరరసప్రసూతంబు స్వల్పమృదుత్వ మోజఃప్రసాద
విధముల భారతీవృత్తిఁ గావ్యంబులయందుఁ జెప్పఁగ నొప్పుఁ బొందుగాను
నవభావభేదమధ్యవిభాషితతజుగుప్సబీభత్స మనఁగ నొప్పిదముఁ గాంచు
నారభటీప్రసాదౌజసవిధములు నొప్పుపద్యముల నత్యుద్ధృతంబు
సన్నుతాపస్తంబసంతతి శృంగారశత్రువు నందికేశ్వరునిబంటు
కాలవర్ణము ద్విప్రకారమై యది చెప్పఁబడు జుగుప్సాఖ్యబీభత్సరసము
పెనుపొంద వైరాగ్యబీభత్సరసమును ననఁగ నీభేదంబు లరయవలయు
మునుపు తొమ్మిదిభేదములలోన నెన్నినభయము భయానకాహ్వయముచేతఁ
బరఁగు యాజుషము బీభత్సంబుపట్టి ధూమ్రాభంబు వీరరసాహితంబు
ధర మహాకాళునిదళవాయి సాత్వతి నోజఃప్రసాదసంయుక్తి నమరుఁ
గవితల నీషత్ప్రగల్భంబు సర్వాంగకంపనవైస్వర్యకారణంబు
శమము శాంతం బయ్యెఁ జంద్రసన్నిభము నిర్వైర మొందును బరబ్రహ్మలెంక