Jump to content

పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మాలంబనోద్దీపనాహ్వయంబుల రెండు తెఱఁగుల ధాత్రి నుద్దీపనాఖ్య
మాలంబనోక్తగుణాలంబనవిచేష్టితాలంక్రియాత్మవిహారలీల
లనఁ జతుర్విధములఁ దనరారు ననుభావ మంగవేష్టోద్భూత మగుచు వెలయు
ధర మనోవృత్తి సత్త్వం బనఁబడు నందు సంభవించినయది సాత్త్వికంబు
గణుతింప నా సాత్త్వికము కంప ఘర్మ సంస్తంభ వైవర్ణ్య [1]వైస్వర్యబాష్ప
విలయరోమాంచసంజ్ఞల నష్టవిధముల బరగు నవ్వల వ్యభిచారికంబు
స్థాయిభావమున నిత్యత్వంబు నొందక వ్యభిచరించుచు సాగరాంతరమునం
బొదలు భంగముభంగిఁ బొడముచు నడఁగుచు సంచారిభావసంజ్ఞతయును దాల్చి
వ్యాధ్యసూయావాగహర్షలజ్జామర్షదైన్యావహిత్థనిద్రావిషాద
శంకామదగ్లానిచపలతావస్మారసుప్తీచింతాత్రమౌత్సుక్యమరణ
గర్వమోహాలస్యనిర్వేదసంత్రాసధృతిజడతోగ్రతాస్మృతివితర్క
మతిసుసంబోధనోన్మాదనామంబులఁ బేర్చు ముప్పదిమూఁడుభేదములను
బ్రకటంబు లై స్థాయిభావంబు లన దోషశమజుగుప్సాభయోత్సాహశోక
హాసవిస్మయరతు లనఁగఁ దొమ్మిది యొప్పు నవరసోదయకారణంబు లగుచుఁ
బంచవిధంబులై పరఁగు భావంబులు స్థాయిభావసమన్వితము లగుచు


తే.

వీని నన్నింటి నెఱిఁగిన[2]వెనుకఁగాని, నవరసంబులు పుట్టుచందములు వాని
భేదములు లక్షణంబులు నాది గాఁగఁ, దెలియఁ బోలదు తలగెడదేశవాస.

37

శృంగారరససీసమాలిక

సీ.

వెన్నముద్దకుఁ బాకవిధిచే ఘృతత్వంబు దనరుభంగిని నన స్థాయిభావ
ములకు విభావప్రముఖ్యభావంబులవలన రసత్వంబు గలుగుచుండుఁ
దద్రసం బంతయుఁ దనకుఁ గావ్యాదులందు నాట్యంబులందు ననారతంబు
గలుగుఁ గాని రసంబు గలుగ దారోప్యంబు కావున నటియించు కాంతలందు
గరిమ నా రసము శృంగారంబు హాస్యంబు రౌద్రంబు కరుణ బీరంబు నద్భు
పఠన పస్థాయిభావముల; జెప్పన కలియె విధానాదరుజనముల
తంబు భీభత్సంబు దారుణంబును శాంతమును నాఁగ నవవిధంబుల మెలంగు
పరనవస్థాయిభావములలోఁ జెప్పిన రతియె విభావాదిరంజనముల
నయ్యెను శృంగార మది నీలవర్ణంబు వెన్నునిమొన సామవేదవంశ
వర్యంబు గడు సౌకుమార్యంబు కైశికీవృత్తిని మధురతావిధమునందు
సుప్రసాదాభిదానప్రాణ[3]ఫణితిని విరచింప నొప్పుఁ గవిత్వమునను

  1. వైస్పర్శ్య (సూ)
  2. వెనక (ప,వా,పె) ఇట్లే ఈమాట వ్రాఁతపుస్తకములో నున్నది.
  3. భణితి