Jump to content

పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జాతియు నుపమయు సద్రూపకంబును భ్రాంతిమంతంబు నపహ్నుతియును
దీపకత్రయము నాక్షేపంబు [1]శ్లేషంబు నుత్ప్రేక్షయును దుల్యయోగితయును
వ్యతిరేకమును నుదారతయుఁ బ్రేయస్కంబు నెసఁగ విరోధ మావృత్తివిధము
భావికాఖ్యానంబుఁ లతివృత్తియును సమాహితము నప్రస్తుతస్తుతిపరంబు
వ్యాజస్తుతియును బద్యాయోక్తియును విశేషోక్తి వక్రోక్తి సహోక్తిసంజ్ఞ
లూర్జస్వియును సమానోక్తిసమాఖ్యయు జగతి విభావనాసంకరములు
రసవంతమును నిదర్శనమును సూక్ష్మంబు లవనామకంబు హేతువుఁ గ్రమంబు
నాశీర్వచనము నర్థాంతరన్యాసంబు నతిశయోక్తియు నుదాత్తాభిధంబు
నన నొప్పు నిన్నియాు నర్థంబులకు నలంకారభేదంబులై కానఁబడును
దొలుతటి రూపకాదులు తమలోఁ దాము కలసి సంసృష్టిసంకరము లనఁగ
ద్వివిధంబు లగు నందుఁ దిలతండులన్యాయసంసృష్టిఁ గృతులఁ బ్రశస్త మయ్యె
సంకరంబులు రెండు బరగు దుగ్ధోదకన్యాయనృకేసరిన్యాయములను


తే.

క్షితిని శబ్దార్ధసంసృష్టిఁ జెందునట్టి, సంకరంబులు మఱియును జాలఁ గలవు
వరుస నవి యెల్లఁ దెలియంగవలయఁ బూర్వ, శాస్త్రలక్షణలక్ష్యోక్తసరణివలన.

33

శబ్దార్థదోషసీసమాలిక

సీ.

కనుఁగొన దుష్ప్రయోగము వైరివర్గంబు ధరఁ దత్సమాపశబ్దక్రమంబు
నపసంస్కృతాఖ్యంబు నప్రయుక్తంబు విసంధి దుస్సంధి పసందిపదము
లవల నకారశూన్యంబు హీనోక్తియుఁ గొఱలు దీర్ఘపుకాకుఁ గుఱుచకాకు
సమసనభంగంబు ఛందోయతిప్రాసభంగంబులు ననంగఁ బదియు నాఱు
శబ్దగతప్రదోషంబులై యెప్పారుఁ గృతులు సాగవు వీని నెఱుఁగకున్న
న్యూనోపదోపమయును నధికపదోపమయు నప్రసిద్ధోపమావిధంబ
నసదృశోపమయు మహాధికోపమయును నీచోపమయు వ్యర్థవాచకంబు
దేశసమయలోకదిక్కాలమైత్రీవిరోధాగమకళావిరోధములును
వ్యాకీర్ణకము ససమర్థ మపార్థంబు విరసంబు నతిమాత్రవిశ్రుతంబు
నశుభలజ్జాజుగుప్సాశ్లీలములు సంశయంబు సందిగ్ధనేయార్థములును
బ్రక్రమభంగం బపక్రమంబును గ్రమభంగంబు శ్రుతికటుపరుషములును
క్లిష్టగూఢార్థం బపుష్టార్థకము నసంగతదోషము [2]సతత్ప్రకర్షణ మధి
కపదంబు మఱి సమాప్తపునరాత్తంబును హీనపదంబు నిర్హేతుకంబు
నవిమృష్టకవిధేయకాంశ మన్యార్థంబు నప్రతీతికము ననర్థకంబు
భిన్నసంబంధంబు భిన్నలింగము భిన్నవచన మలంకారవర్జితంబు

  1. శ్లిష్టంబు (సూ)
  2. సతత్ప్రకర్షణంబు, నధికపదంబు, సమాప్తపునరాత్తంబు (గి) ఇందు గణభంగము; కాన సపరింపబడినది (రా).