Jump to content

పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

అని యతఁ డానతిచ్చి [1]చన నంతట మేల్కని నాల్గుదిక్కులుం
గనుఁగొని యద్భుతంబుఁ గుతుకంబును డెందమునం బెనంగ వేఁ
గినఁ గల [2]కేదిబద్ధ మని కేరుచు నుండెడువేళ నా మతం
గనగనివాసి పుస్తకనికాయధరుం డొకరుండు వచ్చినన్.

63


క.

ఆ విపు నతిథిఁగా సం, భావించి భుజింపఁ బెట్టి భాషించునెడన్
దా 'విశ్వశ్రేయం' బను, నీవచనము సదువ నెచటి దిది యన నతఁడున్.

64


క.

'నన్నయభట్టీయములో, నెన్నఁగఁ బ్రథమార్య గాదె యీపొత్తములో,
నున్నయవి యెనుబదియు రెం', డన్న మహాద్భుతముఁ బొంది యపు డెల్లరకున్.

65


వ.

మదీయస్వప్నవిధం బంతయుఁ దేటపడ నెఱింగించిన నాకర్ణించి సకలజనంబులు
నానందంబుఁ బొంది రందుఁ గొందఱు మాతృసంబధు లగు మదీయబంధువులు
గూడఁ గులసింధుసౌగంధికబంధులును గృతప్రబంధులను నీతియుగంధరులును
గావున నా కి ట్లనిరి.

66


క.

'హరిఁ గాంచుటచే మోక్షము, సిరిచే నర్థంబు ధాత్రిచే భూమియు శం
ఖరథాంగమ్ముల విజయము, విరచించు మటన్న కృతిని విద్యయుఁ గలుగున్.

67


ఆ.

శ్రేయ మబ్బు ననుచుఁ జెప్పె విష్ణుఁ డనఁగ, మంచి కల యటంచు నెంచ నేల
అతఁడు సెప్పు మన్న దితనిచే నిప్పుడు, గలిగె నిదియె సాక్షి గాదె మనకు.

68


వ.

అదియునుం గాక.

69

కర్తృవంశావతారము

సీ.

శ్రీవిష్ణునాభిరాజీవసంభూతుఁ డే, వసుమతీసురునకు వంశకర్త
రామాయణామరభూమీరుహాబ్ధి యే, వితతాగమాంతసంవేద్యగురుఁడు
కశ్యపాత్రివసిష్ఠగౌతమభృగువు లే, సూనృతభాషణుజోడువారు
పృథులశస్త్రకళాధురీణుండు ద్రోణుఁ డే, గురతపోరాశికి గూర్మిపట్టి


తే.

యతఁడు తనరారు సర్వలోకైకయోగ్య, తారకాపథవర్తి విస్తారకీర్తి
దురితకథపరిత్యాగి పరిమయోగి, [3]వరగుణాస్థాని శ్రీభరద్వాజమౌని.

70


తే.

అమ్మహామౌనిగోత్రాబ్ధి నవతరించి, తమ్ములును దాను నన్యోన్యతను దనర్చి
[4]తమ్ములను బోరునని సోముఁ ద్రస్తరించు, నౌర సోమాహ్వయుఁడు కాకునూరిఘనుఁడు.

71


తే.

అతఁడు మధురను బుధసమూహములఁ దొడరి, వేదశాస్త్రపురాణాదివాదములను
గాకు నూరింటిఁ జేసినకారణమునఁ, గూకునూరింటివాఁ డన ఘనతఁ గాంచె.

72
  1. చను (ప)
  2. కేదబద్దమని (వా)
  3. వరగుణస్థాని (సూ)
  4. తమ్ములనె పేరుననె సోము (సూ)