Jump to content

పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్వప్నప్రకారము

సీ.

ధాతరెండవపరార్ధమున నాదిదినంబుపగటి వరాహకల్పంబునందు
మహితవైవస్వతమనువేళ దేశంబు లర్థింప నైన మహాయుగమునఁ
గలిసమయంబునఁ దొలిచరణంబున మాసికం బగు చాంద్రమానమునను
శాలివాహననామశకమున గజశైలశరసుధాకిరణులసంఖ్య (1578) నడవ[1]


తే.

నంగజాబ్దంబునను దక్షిణాయనమున, జలధరర్తువు [2]మొదలిమాసంబునందు
బహుళమున దేవకికిఁ జక్రపాణి పుట్టి, నట్టి యష్టమి సనుదేర నధికభక్తి.

33


సీ.

చక్రవాళాంతరక్ష్మామధ్యసంస్థితదైవతగోత్రంబు దక్షిణమున
లవణాబ్ధివేష్టితలక్షయోజనసువిస్తారజంబూద్వీపతలమునందు
భరతవర్షంబున భరతఖండంబున మంగళోర్విని గర్మమహితభూమి
మలయవింధ్యాచల[3]మధ్యమంబునఁ గృష్ణయామ్యతీరమున బ్రహ్మాశ్రమమున


తే.

దండకాటవి [4]నంధ్రాభిదానపుణ్య, దేశమున శ్రీగిరీశాన్యదిశను కొండ
వీటిపడమటఁ [5]దంగెడవిషయమునను, గామెపల్లిని గోపాలధామమునను.

34


క.

కల్పోక్తమార్గమున సంకల్పము గావించి గోపికావిభుపూజల్
సన్పి మది నతనిపదములు, నిల్పి పురాణార్థగోష్ఠి నిశ గడుపునెడన్.

35


సీ.

మిగులఁ జేతులరెంట మేటిశంఖంబును జుట్టుఁగైదువయును బట్టువాఁడు
ముద్దులగుమ్మలౌ ముద్దియ లిద్దఱు కైదండ లిడ నీటు గలుగువాఁడు
బంగారుచెఱఁగుల పచ్చనిహొంబట్టుదుప్పటి [6]యొల్లెవా టొప్పువాఁడు
హారకేయూరమంజీరకోటిరాది[7]భూషణంబులు చాలఁ [8]బూనువాఁడు


తే.

నుదుటఁ గస్తూరితిలకంబు వొదలువాఁడు
తలఁచి చూచిన నా కులదైవ మగుచు
[9]బొలుచు నాకులదైవంబుఁ బోలువాఁడు
నిలిచె నొకరుఁడు నాదుముంగలను [10]గలను.

36


వ.

ఇట్లు నిలిచిన.

37


క.

కరములు రెంటను దాల్చిన, పరికరములు చూచి యతనిఁ బరమేశునిఁగాఁ
బరికించి లేచి వలగొని, మురియుచు సాష్టాంగదండము లొనర్చి వెసన్.

38
  1. క్రీ. శ. 1656
  2. మొదటి (సూ)
  3. మధ్యంబునను (సూ)
  4. నాంధ్రా (గి) వ్రాఁతప్రతులలో నన్నిచోటుల 'ఆంధ్ర'శబ్దమే కనఁబడుచున్నది.
  5. కంగేడ (సూ)
  6. వల్లెవా టొప్పు (సూ)
  7. భూషణంబులఁ జాలఁ (ప)
  8. బొదలువాఁడు (వా)
  9. బోల్చుఁ (వా)
  10. వెసను