పుట:అక్షరశిల్పులు.pdf/92

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అక్షరశిల్పులు

సాహిత్యానికి సంబంధించిన చిన్నచిన్న కదలు చోటు చేసుకున్నాయి. వివిధ భాషల్లో వెలువడిన మంచి కథలను తెలుగు

లోకి అనువదించడం, బాలల భవిష్యత్తు పట్ల ప్రత్యేక ఆసక్తితో బాల సాహిత్యం అభివృద్ది పట్ల శ్రద్ద. తెలుగులో వచ్చిన మంచి కవితలను ఉర్దూలో తర్జుమా చేసి ప్రచురించడం. రచన: ప్రవక్తగారి న్యాయతీర్పులు. లక్ష్యం: సమాజాన్ని మంచి వైపుగా మార్గదర్శకం చేయడం. చిరునామా: షేక్‌ ఖాదర్‌ వలి, ఇంటి నం.1-1948, పెద్దా మసీదు వద్ద, శ్రీకాళహస్థి, చిత్తూరు జిల్లా. దూరవాణి: 08578-320346.

ఖాద్రి సయ్యద్‌ మొహిద్దీన్‌
ఖమ్మం జిల్లా కల్లూరులో 1941 ఏప్రిల్‌ రెండున

ఎస్‌.ఎ.ఖాద్రి, ఖాతూన్‌ బీలకు జన్మించారు. ఉర్దూ, అరబిక్‌ భాషా పండితులైన ఆయన ఉపాధ్యాయుడిగా సుదీర్ఘ…కాలం పనిచేసి ప్రధానోపాధ్యాయుడిగా రిటైర్డ్‌ అయ్యారు. 1979లో 'పరదా' మీద తొలి వ్యాసం రాయడంతో సాహిత్య ప్రస్థానం ఆరంభించారు. ఇతర భాషలలోని ధార్మిక గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. ఈ మేరకు స్వతంత్ర, అనువాద గ్రంథాలు 20 వరకు ప్రచురితం అయ్యాయి. ఈ గ్రంథాలన్నీ పలుమార్లు పునర్మద్రణకు నోచుకోవడం విశేషం. తెలుగు, హిందీ భాషలలో మంచి ప్రవేశం ఉన్న ఆయన రాసిన 150 పైగా ధార్మిక వ్యాసాలు, కవితలు, కథలు వివిధ తెలుగు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఎస్‌.ఎం ఖాద్రి రాసిన మరికొన్ని బృహత్తర గ్రంథాలు ప్రస్తుతం ప్రెస్‌లో ఉన్నాయి. ఆయన రాసిన చాలా పుస్తకాలను తెలుగు ఇస్లామిక్‌ పబ్లికేషన్స్‌ ట్రస్ట్‌ (హైదారాబాద్‌) ప్రచురించింది. చివరిక్షణం వరకు రచనా వ్యాసంగంలో గడిపిన సయ్యద్‌ మొహిద్దీన్‌ ఖాద్రి ఖమ్మం జిల్లా కల్లూరు సమీపంలోని స్వగ్రామం రంగంబంజరులో 2008 డిసెంబరు 25న కన్నుమూశారు. (సమాచారం: సయ్యద్‌ మొహిద్దీన్‌ ఖాద్రితో ఇంటర్వూ, 2008 ఆగస్టు 11న, హైదారాబాద్‌.)

ఖాజా
కర్నూలు జిల్లా. కలం పేరు-రోషన్‌. సాహిత్యాభిలాషి. రచనలు: విధివినోదం,

గేయకవితలు. ఖాజా బి. ఎండి. అనంతపురం జిల్లా ఉరవకొండ నివాసి. నాటకాలు, నాకలు, కవితలు గేయాలు, కథానికలు రాశారు. కవితలు, గేయాలు ప్రచురితం.

ఖాజా హుస్సేన్‌ సయ్యద్‌
అనంతపురం జిల్లా గుత్తిలో 1926 జూన్‌ 16న జన్మించారు.

తల్లితండ్రులు: మోహిద్దీన్‌బీ, సయ్యద్‌ సర్వర్‌ సాహెబ్‌. చదువు: బి.ఎ., ఎల్‌ఎల్‌.బి. భారత

91