పుట:అక్షరశిల్పులు.pdf/91

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

జర్మన్‌, హిందీ, ఉర్దూ తదితర ఇతర భాషల్లోకి అనువదించబడింది. ఆయా భాషా పత్రికల్లో, సంకలనాల్లో చోటుచేసుకుంది. ఇండియా టుడే (పత్రిక), తానా, యువభారతి, భారత్‌ భవన్‌ (భోపాల్‌) లాంటి సంస్థలు రూపొందించిన ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వందా కవితలతో కూడిన సంకలనాల్లో 'పుట్టుమచ్చ' కవిత స్థానం పొందింది. యాభై సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల సందర్భంగా 'భారతీయ ముస్లింల ముఖచిత్రం' అను సుదీర్ఘ… చర్చా వ్యాసాన్ని ఎండి.రియాజ్‌ (వరంగల్‌)తో కలసి రాసి ప్రచురించారు. 1991లో విజయవాడ నుండి వెలువడిన 'షేర్‌ కాలమ్‌' పత్రికను నిర్వహించారు. 1998లో 'శ్రీ రాములయ్య' సినిమాకు కథను సమకూర్చారు. చిరునామా: ఖాదర్‌ మొహియుద్దీన్‌ అబ్దుల్‌ ఖాదర్‌, కెజి గుప్తా మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ కాలనీ, బందర్‌ రోడ్‌, విజయవాడ-520 010. దూరవాణి: 90009 76999, 0866-2475374. Email: ushakhadar@yahoo.com.

ఖాదర్‌ షరీఫ్‌ షేక్‌
నెల్లూరు జిల్లా సూళ్ళారుపేటలో 1975 జూన్‌ ఆరున జననం.

తల్లితండ్రులు: ముంతాజ్‌ బేగం, షేక్‌ మస్తాన్. ఉద్యోగం: రాష్ట్ర నీిపారుదల శాఖ (సోమశిల). 1998లో ఆంధ్రప్రభలో 'సఫర్‌' కథా ప్రచురణతో రచనా వ్యాసంగం ఆరంభం. అప్పటినుండి రాష్ట్రంలోని వివిధ పత్రికల్లో, పలు కథా-కవితా సంకలనాల్లో కవితలు, కథలు, సాహిత్య వ్యాసాలు, సమీక్షావ్యాసాలు ప్రచురితం. రచనలు: శ్వేతసంబంధాలు (2000 లో ఐదుగురు మిత్రులతో కలసి రాసిన కవితా సంపుటి), పసుపునీళ్ళ వాన (కథా సంపుటి, 2010), వివశత్వం (కవితా సంపుటి, 2010). పురస్కారాలు: ఉత్తమ ప్రాంతీయ కవితా అవార్డు (2004, హైదారాబాద్‌), ప్లమింగ్ గో ఫెస్టివల్‌ అవార్డు (సూళ్ళారుపేట, 2007), కుందుర్తి -రంజనీ అవార్డు (2008, హైదారాబాద్‌), ఇండియన్‌ లిటరరీ అవార్డు (2009, న్యూఢిల్లీ), రాష్ట్రీయ ఉత్తమ కవితా అవార్డు (2009, న్యూఢిల్లీ), ఉగాది పురస్కారం (2008, హైదారాబాద్‌). లక్ష్యం: సమాజంలో నిజమైన మానవుని నిర్మాణం కోసం సాహిత్యం ద్వారా కృషి సాగించడం. చిరునామా: ఖాదర్‌ షరీఫ్‌, క్వార్టఫర్స్ నం.18/3, సోమశిల ప్రాజెక్టు క్వార్టర్స్‌, సోమశిల- 524301, నెల్లూరు జిల్లా. సంచారవాణి: 94419 38140.

ఖాదర్‌ వలి షేక్‌
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో 1943 జూలై ఒకిటిన జననం.

తల్లితండ్రులు: సయ్యద్‌ ఫాతిమాబీ, షేక్‌ అబ్దుల్‌ రహ్మాన్‌. కలంపేరు: అంవర్‌. చదువు:

అక్షరశిల్పులు.pdf

ఎం.ఏ., బి.ఇడి. ఉద్యోగం: అధ్యాపకులు (రిటైర్డ్‌). తెలుగు, ఉర్దూ, హిందీ, అరబిక్‌ భాషల్లో ప్రవేశం. 1960లో 'చందమామ' మాసపత్రికలో 'స్నేహితులు' తొలి కథ ప్రచురితం. అప్పటినుండి వివిధ పత్రికల్లో కథలు, కవితలు, గేయాలు, వ్యాసాలు, ప్రధానంగా బాల

90