పుట:అక్షరశిల్పులు.pdf/90

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డదిఅక్షరశిల్పులు

ఖాదర్‌ మస్తాన్‌ అలీషా షేక్‌
ప్రకాశం జిల్లా కొమ్మాలపాడు గ్రామంలో 1923లో
అక్షరశిల్పులు.pdf

జన్మించారు. తల్లితండ్రులు: మస్తానమ్మ, చిన్న మొహమ్మద్‌ ఖాశిం సాహెబ్‌. ఆయన పూర్వీకులు షేక్‌ ఖాదర్‌ మస్తాన్‌ అలీషా, షేక్‌ దారియా హుస్సేన్‌ అలీషాలు (అచల సిద్ధాంత పీఠం, కొమ్మాల పాడు) రూపొందించిన ఆధ్యాత్మిక గ్రంథం 'ఆర్యానంద సుధా లహరి'ని పూర్తి స్థాయిలో విషయం పరంగా అభివృద్ధిపర్చి 1977లో వెలువరించారు. ఈ ఆధ్యాత్మిక గ్రంథంలో ప్రబోధించిన ధార్మిక-తాత్విక భావాలను జీవితాంతం ప్రచారం చేశారు. ఆ తరువాత ఈ గ్రంథం పలు ముద్రణలకు నోచుకుంది. షేక్‌ ఖాదర్‌ మస్తాన్‌ అలీషా అక్టోబర్‌ ఒకిటి, 1983లో కొమ్మాలపాడులో కన్నుమూశారు.

ఖాదర్‌ మొహియుద్దీన్‌ ముహమ్మద్‌ అబ్దుల్‌
కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలం

చీమలపాడు గ్రామంలో 1955 ఆగస్టు 10న జననం. తల్లితండ్రులు: తురాబ్‌ బీబీ, ముహమ్మద్‌ అబ్దుల్‌ రజాఖ్‌. కలంపేరు: ఖాదర్‌ మొహియుద్దీన్‌. చదువు: సాహిత్య విశారద (ప్రయాగ). తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో ప్రవేశం. వృత్తి: జర్నలిజం. 1978 నుండి 1991 వరకు 'విశాలాంధ్ర', 'ఉదయం', 'ఆంధ్రభూమి' దినపత్రికల్లో పలు బాధ్యతల నిర్వహణ. పందొమ్మిది ఏండ్ల వయస్సులో 'విశాలాంధ్ర' దిన పత్రికలో 'చెహోవ్‌ సాత్విక విషాదం' వ్యాసం రాయడం ద్వారా రచన వ్యాసంగం ఆరంభం. అప్పటి నుండి వివిధ పత్రికల్లో, సంకలనాల్లో కవితలు, వ్యాసాలు, సాహిత్య విమర్శనా వ్యాసాలు, సమీక్షలు, సమీక్షా వ్యాసాలు చోటు చేసుకున్నాయి. ఆ కవితల్లో కొన్నిఇతర భాషల్లోకి అనువదించబడి ఆయా భాషా పత్రికలలో ప్రచురితంఅయ్యాయి. ఈ రచనలలో 1979లో రాసిన 'అనుభూతి వాదం అంటే ఏమిటి?' (ఆంధ్రజ్యోతి, 1979),

అక్షరశిల్పులు.pdf

'ఆరుద్ర ఎక్కాల్సిన రైలు ఒక జీవితకాలం లేటు' (ఉదయం, 1985), 'గద్దర్‌ ఒక యుద్ధనౌక', 'బ్రాహ్మణీకం నుంచి బ్రాహ్మణీకంలోకి...' (ఆంధ్రజ్యోతి వారపత్రిక) అను సాహిత్య వ్యాసాలు చర్చకు కారణమయ్యాయి. 1991లో ఫిబ్రవరిలో వెలువరించిన 'పుట్టుమచ్చ' (కవితా సంపుటి), 'అప్పటి దాకా కొద్దిమంది ముస్లింల గొంతులోంచి బయటకు రాకుండా గుక్కపట్టిన దు:ఖాన్ని, వ్యధనూ...వ్యక్తీకరించింది. తొలిసారిగా ముస్లింల జీవితంలో అనేక పార్శ్వాలను ఈ కవిత ద్వారా ఖాదర్‌ ప్రపంచం దృష్టికి తెచ్చాడు' అని ప్రశంసలందుకుంది. ఈ కవితా సంపుటిలోని 'పుట్టుమచ్చ' కవిత జాతీయ స్థాయిలో బహుళ ప్రజాదారణ పొందింది. అంతర్జాతీయ సాహిత్య సదస్సుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించి ఆంగ్లం,

89