పుట:అక్షరశిల్పులు.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు

ఆగస్టు ఆంధ్రభూమి మాసపత్రికలో రాసిన 'మాతృభాష' కథ మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 'పల్లెపడుచు' జానపద పాటల వీడియో రూపానికి వ్యాఖాన రచన చేశారు. తెలుగు పత్రికలు నిర్వహించిన కథానికల, కవితల పోీలలో పలుసార్లు విజేతగా ఎంపిక. తెలుగు దినపత్రికలలో 'సమీర' కలం పేరుతో చాలా కాలం పలు 'కాలమ్స్‌' నిర్వహించారు. కర్నూలు కేంద్రంగా 'ఎక్స్‌ప్రెస్‌ యాడ్స్‌' త్రైమాస బులిటిన్‌ వెలువరిస్తున్నారు. అవార్డులు -పురస్కారాలు: మందాకిని పురస్కారం (1988, కర్నూలు), ఉగాది పురస్కారం (1996, గుంటూరు), ఎన్టీయార్‌ స్మారక అవార్డు (1996, హైదారాబాద్‌), మనోరంజని సాహితీ అవార్డు (హైదారాబాద్‌). రచనలు: ఎటునుండి నరుక్కు రావాలి (కథల సంకలనం). లక్ష్యం: మనం పూర్తిగా మరచిపోతున్న ఆచార-సంప్రదాయాలు, ఆర్థిక వ్యత్యాసాల వల్ల ప్రజలలో వేగంగా తరిగి పోతున్న ప్రేమైక బంధాలను సమాజానికి గుర్తు చేయడం. చిరునామా: సయ్యద్‌ జహీర్‌ అహమ్మద్, ఇంటి నం.77/1076, ముజఫర్నగర్, కల్లూర్ ఎస్టేట్, కర్నూలు-3 కర్నూలు జిల్లా. సంచారవాణి: 93924 52601.

జైనుల్‌ ఆబెదీన్‌ ముహమ్మద్‌
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట జన్మస్థలం. పుట్టిన

తే ది : 24-12-1916. తల్లితండ్రులు: మహబూబున్నీసా,

మహబూబ్‌ సాహెబ్‌ద్‌, . చదువు: బి.యస్‌.సి (అగ్రికల్చర్‌). కలంపేరు:

భయ్యా. మంచి వక్త. ఇస్లాం సందేశాన్ని ప్రతిభావంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో దిట్ట. 1982లో హైదారాబాద్‌లో జరిగిన 'ఆంధ్రప్రదేశ్‌ ముస్లిం తెలుగు రచయితల సమ్మృళనం' సందర్బంగా వెలువడిన 'వెలుగు దివెవ్వలు' ప్రత్యేక సంచికలో 'నా జీవితం పై తెలుగు ప్రభావం' శీర్షికన వ్యాసం ప్రచురితమైంది. రచనలు: ఖురాన్‌ సూక్తులు, ఖుర్‌-ఆన్‌ ప్రవచనములు, ముహమ్మద్‌ ప్రవక్త జీవితము-సందేశములు, భయ్యాశతకము, ముస్లిం విశ్వాస సాధనములు, పలు కవితలు-ధార్మిక, సాహిత్య వ్యాసాలు.

జలాలుద్దీన్‌ యూసుఫ్‌ ముహమ్మద్‌
లోక శాంతికి దైవ సూత్రము, మతము

-రాజకీయము, యదార్థమేది?, దైవ నియమావళి లాంటి పలు ధార్మిక గ్రంథాలను స్వయంగా రాసి ప్రచురించారు.

జలీల్‌ అబ్దుల్‌ ముహమ్మద్‌
వరంగల్‌ జిల్లా మామనూరు గ్రామంలో 1970 జూన్‌

26న జననం. తల్లితండ్రులు: ఫాతిమా బేగం, అబ్దుల్లా. కలం పేరు: జన్నుజలీల్‌. చదువు: బి.ఏ, తెలుగు పండిట్. గాయకుడు. 1988లో గీటురాయిలో ధార్మిక వ్యాసం రాయడంతో ఆరంభించి వివిధ పత్రికలలో వ్యాసాలు, గేయాలు, పాటలు ప్రచురితం అయ్యాయి.

81