పుట:అక్షరశిల్పులు.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

రచన వ్యాసంగం ఆరంభం. ఉర్దూ, అరబిక్‌ భాషల్లోని పలు గ్రంథాలను తెలుగులోకి అనువదించగా వాటిని వివిధ ప్రచురణ సంస్థలు ప్రచురించాయి. రచనలు: 1. ఇస్లాం మరియు అజ్ఞానం, 2. దైవ ప్రవక్తలు (మూడు భాగాలు), 3. భవ బంధాలు మోక్షానికి ప్రతి బంధాకాలా? 4.కారుణ్య వ్యవస్థ, 5. పరదా ప్రగతికి ప్రతిబంధకమా?, 6.

నవయుగం-నవతరం, 7. ఒక మనిషి రెండు వైఖరులు, 8.

ప్రపంచ మతాలు, ఇస్లాం, 9. ఒడి నుండి సమాధి వరకు, 10. రమజాన్‌కు స్వాగతం, 11. మర్యమ్‌ జమీలాతో ఇంటర్యూ, 12. త్యాగనిరతి, 13. భారత నారి, 14. తలాఖ్‌, 15. శిక్షణకు తొలిమెట్టు, 16. మస్జిద్‌ వ్యవస్థ, 17. ఆదర్శ మహిళ ఆయెషా (రజి), 18. కారుణ్యం కురిసిన వేళ, 19. సుమదుర సందేశం, 20. మానవ జీవితంపై నమాజు ప్రభావం, 21. ఇస్లాం మెచ్చిన మహిళలు, 22. పశ్చాత్తాపం, 23. తావీజులు తాయెత్తులు, 24. విడాకులు ఎక్కడ? ఎప్పుడు? ఎలా?, 25. హిస్సుల్‌ ముస్లిం. లక్ష్యం: ఇస్లాం సందేశాన్ని పదిమందితో పంచుకోవడం. చిరునామా: ఇక్బాల్‌ అహమ్మద్‌, ఇంటి నం. 16-2-39/ఏ, అక్బర్‌ బాగ్, మలక్‌పేట, హైదారాబాద్‌-500036.

ఇక్బాల్‌ చంద్‌ డాక్టర్‌
కృష్ణా జిల్లా విజయవాడలో 1968 సెప్టెంబర్‌ 21న

జన్మించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో స్థిరనివాసం. చదువు: ఎం.ఏ (తెలుగు)., ఎం.ఏ (ఆంగ్లం)., పి.హెచ్‌డి. తెలుగు, ఆంగ్ల భాషా పండితులు. ఉద్యోగం: తొలుత ఉపాధ్యాయులు. ప్రస్తుతం బెంగళారులోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. కవితలు, గేయాలు, సాహిత్య వ్యాసాలు వివిధ పత్రికల్లో ప్రచురితం. కొన్నికవితలు హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లోకి అనువాదామై ఆయా భాషా పత్రికల్లో కూడా ప్రచురితం. రచనలు: ఆరోవర్ణం (2001), బంజారా (కవితా సంపుటి, 2007) చిరునామా : డాక్టర్‌ ఇక్బాల్‌ చంద్‌, మసీదు వీధి, సత్తుపల్లి- 507302, ఖమ్మం జిల్లా. సంచారవాణి: 94412 11765.

ఇక్బాల్‌ ఎం.జి
గుంటూరు జిల్లా సిరిపురంలో 1963

ఫిబ్రవరి 13న జననం. తల్లి తండ్రులు: అమీరున్నీసా, అబ్దుల్‌ రహ్మాన్‌ షరీఫ్‌. చదువు: ఇంటర్‌. వ్యాపకం: ఉద్యోగం. 1990లో 'హేతువాదం' మాసపత్రికలో (నరసరావుపేట) తొలి వ్యాసం ప్రచురితం. అప్పటినుండి హేతువాద, మార్క్టిస్ట్‌ భావజాల దృక్పథంతో రాసిన వ్యాసాలు, కవితలు వివిధ పత్రికలలో, రాష్ట్రంలో వెలువడిన కవితా సంకలనాలలో వ్యాసాలు చోటు

76