పుట:అక్షరశిల్పులు.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు

సామాన్యుల వెతలను విశ్లేషిస్తూ రాసిన 'జైతున్‌' కథానికలు గుర్తింపు తెచ్చాయి. లక్ష్యం: సామాజిక చైతన్యం కల్గించడం. చిరునామా: అక్కంపేట ఇబ్రహీం, నరసాపురం- 516217, ఎస్‌ఏ కాశినాయన మండలం, కడప జిల్లా. సంచారవాణి: 95501 13040.

ఇమాం షేక్‌
అనంతపురం జిల్లా అనంతపురంలో 1940 జనవరి ఒకిన జననం.

తల్లి తండ్రులు: బానోబి, మస్తాన్‌ సాహెబ్‌. వృత్తి: జర్నలిజం. కలం పేర్లు: కదలిక ఇమాం,

ఇమాం. 1973 నుండి రచనా వ్యాసంగం ఆరంభం. అప్పటి

నుండి వివిధ పత్రికల్లో సామాజిక, సాహిత్య వ్యాసాలు ప్రచురితం. రాయలసీమ సమస్యల మీద ప్రత్యేకంగా దృష్టి నిల్పి అక్కడి సమస్యల మీద పలు రచనలు చేశారు. 1983 నుండి కదలిక మాసపత్రిక సంపాదాకత్వం వహిస్తున్నారు. ప్రత్యేక రచనలు: 1. తరతరాల రాయలసీమ, 2.అనంత ప్రస్థానం, 3.జిల్లా సాంప్రదాయక నీటివనరులు, 4. నదుల అనుసంధానం, 5. కోటిగొంతుకల ఆక్రందన, 6. సీమ గుండె చప్పుడు, 7. మహిళా సాధికారికత (మూడు భాగాలు). లక్ష్యం: ప్రజలలో సామాజిక చైతన్యం కలుగ జేయడం. చిరునామా: షేక్‌ ఇమాం, ఎర్రనేల కొట్టాలు, ఆర్‌సి నగర్‌, అనంతపురం-515001, అనంతపురం జిల్లా, దూరవాణి: 08554-277789, సంచారవాణి: 99899 04389.

ఇనాయతుల్లా ఎస్‌ఎండి
కర్నూలు జిల్లా బనగానపల్లెలో 1963 ఫిబ్రవరి 16న

జననం. తల్లితండ్రులు: జాఫర్‌ బీ, ఎస్‌ఎండి. ఆజం. ఉద్యోగం:

విద్యాశాఖ. 1980లో 'మానవా సహజ స్వార్థం మానవా?' తొలి కవిత ప్రచురణతో రచనా వ్యాసంగం ఆరంభం. కవితలు, కథలు వివిధ పత్రికలలో, సంకలనాలలో ప్రచురితం. 2000లో రాసిన 'వలస' కథ గుర్తింపు తెచ్చిపెట్టింది. కథలు నాటికలుగా రూపాంతరం చెంది ఆకాశవాణి ద్వారా ప్రసారం. ఉత్తమ కథా రచయితగా పలుమార్లు సత్కారం. లక్ష్యం: వాస్తవిక దృక్పథంతో రచనలు చేయడం. చిరునామా: ఎస్‌ఎండి. ఇనాయతుల్లా, ఇ.నం.87/1319, రెవిన్యూ కాలనీ, కర్నూలు. దూరవాణి: 98493 67922.

ఇక్బాల్‌ అహమ్మద్‌
కృష్ణా జిల్లా విజయవాడలో 1946 నంవంబరు 26న జననం.

తల్లితండ్రులు: షేక్‌ పెంటు సాహెబ్‌, షేక్‌ కరీమున్నీసా. కలంపేరు: ఆరోహి. చదువు: యస్‌యస్‌యల్‌సి. ఉద్యోగం: ధార్మిక ప్రచారం. తెలుగు, ఉర్దూ, అరబిక్‌ భాషల్లో ప్రవేశం. మొట్టమెదటిసారిగా 1975లో గీటురాయి వారపత్రికలో ధార్మిక వ్యాసం రాయడం ద్వారా

75