పుట:అక్షరశిల్పులు.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

వ్యాసంగం ఆరంభం. రచనలు: 1.వేనరాజు సమకాలీన సాంస్కృతికోద్యమాల ప్రభావం (1989), 2.అలంపురి జోగులాంబిక నక్షత్రమాల (2002), 3.కోయిల శతకం (2002). అవార్డులు-పురస్కారాలు: గడియారం రామకృష్ణ శర్మ స్మారక సాహిత్య అవార్డు, స్వర్ణముఖి అవార్డు. లకక్ష్యం: ప్రాచ్యపాశ్చాత్య సాహిత్య తత్వదర్శనం. చిరునామా: డాక్టర్‌ షేక్‌ ఎం.డి మహమ్మద్‌ హుసేన్‌, ఇంటి నం. 80-70 డి, కృష్ణానగర్‌, ఐటిసి ఎదురు, కర్నూలు-518 002, కర్నూలు జిల్లా. సంచారవాణి: 94415 37728.

హుస్సేన్‌ సాహెబ్‌ పి
1950 జులై ఒకిటిన కర్నూలు జిల్లా తరిగోపులలో జననం.

తల్లితండ్రులు: ననెమ్మ, పెద్ద పకీరు సాహెబ్‌. చదువు: ఎం.ఏ. వృత్తి: ఉపాధ్యాయులు. రచనలు: ఈశ్వర సంప్రశ్నము (1994), బాల గీతాలు, నవ్వులు (వచన కవితలు).

హుసేన్‌ సయ్యద్‌
గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం బేతపూడి గ్రామంలో

1957 డిసెంబర్‌ 23న జననం. తల్లితండ్రులు: సయ్యదా గాలిబ్‌ బీబి, ఖాశిం సాహెబ్‌.

చదువు: బికాం. ఉద్యోగం: తెలుగు ఇస్లామిక్‌ పబ్లికేషన్స్‌ ట్రస్ట్‌లో

కార్యనిర్వహణ అధికారిగా పాతికేళ్ళు బాధ్యతల నిర్వహణ. 1983లో 'గీటురాయి' వారపత్రిక ద్వారా రచనా వ్యాసంగం ఆరంభం. ఉర్దూ, అరబ్బీ భాషలను అధ్యయనం చేసి, ఆయా భాషల్లో రాసిన ఇస్లామియా సాహిత్యాన్ని తెలుగులో తర్జుమా చేయడం. తెలుగులోకి అనువాదాలు: 1. విరిసిన మొగ్గలు, 2. మహనీయుల బాట (ప్రథమభాగం), 3. మహనీయుల బాట (ద్వితీయ భాగం), 4.హజ్రత్‌ సాలమ్‌ (రజి), 5. ముస్లిం వేడుకోలు. ఆంగ్లం నుండి అనువాదాలు : 1. వ్యక్తిత్వ వికాసం. లక్ష్యం: ఆధ్యాత్మిక బాటలో జనచైతన్యం. చిరునామా: సయ్యద్‌ హుస్సేన్‌, బేతపూడి-522547, ఫిరంగిపురం మండలం, గుంటూరు జిల్లా. సంచారవాణి: 99853 94757. Email: hussain4757@yahoo.com

ఇబ్రహీం అక్కంపేట
కడప జిల్లా నరసాయపురంలో 1975 జూన్‌ ఒకిటిన జననం.

తల్లితండ్రులు: ఖాతూన్‌ బీ, మహబూబ్‌ సాహెబ్‌. చదువు: బి.ఏ.,

బి.ఇడి ఉద్యోగం: ఉపాధ్యాయులు. 1977లో 'చిన్నీ' కథానిక ప్రచురణ ద్యారా రచనా వ్యాసంగం ఆరంభమై వివిధ పత్రికలు, సంకలనాలలో కథానికలు- కవితలు, వ్యాసాలు ప్రచురితం. ప్రైవేటీకరణ నేపద్యంలో ఉపాధ్యాయుల సమస్యల మీద రాసిన 'కాలానీకి ఎదురీదుతున్నవాడు', ప్రపంచీకరణ నేపధ్యంలో వెల్లువెత్తుతున్న వ్యాపార దృక్పథం వలన వికృతమౌతున్న

74