పుట:అక్షరశిల్పులు.pdf/74

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అక్షరశిల్పులు

హసన, ఇంటి నం. 25-6-106, జూబ్లీమార్క్‌ట్, ఖాజీపేట-506003 హన్మకొండ, వరంగల్‌ జిల్లా. సంచారవాణి: 98667 76293.

హసన్‌ చిన్న షేక్‌
కడపజిల్లా కొండాపురం మండలం బుక్కపట్నం గ్రామంలో 1941లో

జననం. తల్లితండ్రులు: షేక్‌ జాజాబీ, షేక్‌ హుస్సేన్‌ సాహెబ్‌.

అక్షరశిల్పులు.pdf

చదువు: విద్వాన్‌. ఉద్యోగం: హిందీ ఉపాధ్యాయులు. విద్యార్థిగా కళాశాల పత్రికలో 'మహాబలిపురం' కవిత రాశారు. 1973 నుండి కవితలు, ఆధ్యాత్మిక వ్యాసాలు వివిధ పత్రికలలో చోటు చేసుకున్నాయి. 1976లో 'ప్రభోధిని' ఆధ్యాత్మిక మాసపత్రిక ఆరంభించి సంపాదకత్వబాధ్యతలు నిర్వహించారు. లక్ష్యం: ఇస్లామీయ సాహిత్యాన్ని తెలుగులో పాఠకులకు అందించడం. చిరునామా: విద్వాన్‌ ఎస్‌.సి హసన్‌, ఇ.నం.19-131, టెక్కాయ చేను వీధి, జమ్మలమడుగు-516434, కడపజిల్లా, సంచారవాణి: 94400 22571(పిపి).

హసన్‌ వలి షేక్‌: గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో 1973 ఏప్రిల్‌ ఒకిటిన జననం.

తల్లితండ్రులు: షేక్‌ నన్నీబీ, షేక్‌ అబ్దుల్‌ సలాం. చదువు: ఇంటర్‌.

అక్షరశిల్పులు.pdf

వృత్తి: జర్నలిజం. కలం పేరు: రవితేజ. 1987లో 'కట్నలీలలు' కవిత ద్వారా రచనా వ్యాసంగం ఆరంభం. అప్పటి నుండి కవితలు, కథలు, వ్యాసాలు వివిధ పత్రికలలో, సంకలనాలలో ప్రచురితం. మంచి నటుడు. స్వయంగా రాసి, నటించిన పలు నాటికలు ప్రదర్శితమయ్యాయి. అవార్డు: ప్రతిభా అవార్డు (హైదారాబాద్‌) లక్ష్యం: మదిలోని నిర్మాణాత్మక స్పందనను పది మందితో పంచుకోవడం. చిరునామా : షేక్‌ హసన్‌ వలి, ఇంటి నం.1-1107, 3వ లైను, ఎన్టీయార్‌ కాలనీ, చిలకలూరిపేట-522616, గుంటూరు జిల్లా. సంచారవాణి: 93466 57790. Email: skhasnval@rediff.com

హుసేన్‌ మహమ్మద్‌ మహమ్మద్‌ షేక్‌ డాక్టర్
అక్షరశిల్పులు.pdf

మహబూబ్‌నగర్‌ జిల్లా పాతగడ్డ బసవాపురం లో 1948 పిబ్రవరి 19న జననం. తల్లితండ్రులు: ఫాతిమాబీ, హసన్‌ సాహెబ్‌. కలం పేర్లు: గడ్డబసవాపురం మఖేశ్వర్‌, గడ్డబసవాపురం మహేశ్వర్‌. చదువు: ఎం.ఏ., ఎం.ఓ.య ల్‌ . , పి . హెచ్‌ డి . ఉద్యోగం : అధ్యాపకులు. సంస్కృతాంధ్ర భాషా పండితులు. 1974లో 'వేనరాజు-సమకాలీన సాహిత్యం' వ్యాసం ప్రచురణతో రచనా

73