పుట:అక్షరశిల్పులు.pdf/66

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అక్షరశిల్పులు

ఖాన్‌, ఇంటి నం: 18-8-223/121/10/ఎ1, రాజనర్సింహ నగర్‌ కాలనీ, సైదాబాద్‌, హైదారాబాద్‌. సంచారవాణి: 99482 54564, Email: devi@hmtv.in

ఫక్రుద్దీన్‌
కడప జిల్లా దువ్వూరి నివాసి. పలు వేదాంత రచనలు చేశారు. ఆధ్యాత్మిక

తత్వాలను సేకరించి తెలుగులో వెలువరించారు.

ఫక్రుల్లా సాహెబ్‌
కడప జిల్లా కమలాపురం తాలూక తిప్పలూరు గ్రామం జన్మస్థలం.

తల్లితండ్రులు: రసూల్‌ బీ, దాదా సాహెబ్‌. రచనలు: శ్రీరామాయణ సంకీర్తనము (గేయం), విరాటపర్వం, భక్త ప్రహ్లాద, భక్తకుచేల, శ్రీమోహిని రుక్మాంగద చరిత్ర (ద్విపద కావ్యాలు) శ్రీమత్‌ ఆంధ్ర మహాభారతము. నటుడు, గాయకుల

గఫార్‌ ముహమ్మద్‌ అబ్దుల్‌
మహబూబ్‌నగర్‌ జిల్లా ఉప్పనుంతలలో జననం.

తల్లితండ్రులు: మొగులాన్‌ బీబి, అబ్దుల్‌ సత్తార్‌. కలంపేరు: ఎంవి

అక్షరశిల్పులు.pdf

గఫార్‌. చదువు:ఎంఏ.,బి.ఇడి ఉద్యోగం: ఉపాధ్యాయులు. 1981లో ఆకాశవాణిలో 'మారుతున్నది మనిషా? సమాజమా? కవిత ద్వారా రచనావ్యాసంగం ఆరంభం. పత్రికలలో, సంకలనాలలో కవితలు, నానీలు ప్రచురితం. 'నా దేశం ఎటు పోతుంది' కవిత ద్వారా మంచి గుర్తింపు. లక్ష్యం: సమాజంలో మానవత్వం నింపడం. రచనలు: చైతన్యదీపిక (కవితా సంపుటి), నల్లమల రత్నాలు(నానీలు). చిరునామా: ఎం.ఏ గఫార్‌, ఇంటి నం. 2-5, ఉప్పనూతల-509 376, మహబూబ్‌నగర్‌ జిల్లా, సంచారవాణి: 9490324834.

గఫార్‌ పులివీడు షేక్‌
కడప జిల్లా పెద్దా పులివీడు గ్రామంలో 1966 అక్టోబర్‌ 14న

జననం. తల్లితండ్రులు: హుస్సేన్‌ బి, హుస్సేన్‌ పీరా. చదువు: ఎం.ఏ., బి.ఇడి. వృత్తి:

ఉపాధ్యాయులు. కలంపేరు: ఎస్‌పి. గఫార్‌. 2004 జనవరి

అక్షరశిల్పులు.pdf

31న వార్త దినపత్రికలో 'గురు సాక్షాత్‌ పరబ్రహ్మ' వ్యాసం ప్రచురితం కావడం ద్వారా సాహిత్య రంగ ప్రవేశం. పత్రికల్లో, సంకలనాల్లో కవితలు, కథానికలు, వ్యాసాలు ప్రచురితం. ప్రధానంగా ముస్లింలకు కల్పించిన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారికి, రాసిన వారికి దీటుగా సమాధానాలిస్తూ వివిధా పత్రికలలో రాసిన పలు వ్యాసాలు గుర్తింపు తెచ్చిపెట్టాయి. చరిత్ర, సామాజిక శాస్త్రాల ప్రాధాన్యతను ప్రజలకు ఎరుకపర్చి సామాజిక చైతన్యం రగిలించేందుకు 'పీపుల్‌ ఫర్‌ సోషల్‌ సైన్స్‌స్‌' సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులుగా బాధ్యతల నిర్వహణ. లక్ష్యం: చైతన్య రాహిత్యంతో నిర్జీవంగా వున్న ముస్లిం

65