పుట:అక్షరశిల్పులు.pdf/65

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

ఫరీద్‌ షేక్‌
గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామంలో 1927

మార్చి రెండున జననం. తల్లితండ్రులు: మస్తాన్‌ బీ, నాసర్‌ సాహెబ్‌. కలంపేరు : సంస్కారి. చదువు: బి.ఏ. వృత్తి : ఉపాధ్యాయులు. 1950లో ఉద్యోగంలో చేరిక, 1993లో ఉద్యోగ విరమణ. ఉపాధ్యాయుల సంఘాలలో ప్రముఖ పాత్ర వహించిన ఆయన స్వయంగా 'అభ్యుదయ ఉపాధ్యాయ మండలి' (1986) ని ఆరంభించి వ్యవస్థాపకులుగా సంస్థ సబ్యుల అభ్యున్నతి, హక్కుల సాధనకు నిరంతరం కృషి చేశారు. మంచి వక్త, ఉపాధ్యాయ నేతగా ఖ్యాతి గడించారు. చివరి వరకు రచనా వ్యాసంగం కొనసాగిస్తూ 2008 అక్టోబర్‌ 16న చిలకలూరిపేటలో కన్నుమూశారు. రచన: చైతన్య స్వరాలు (కవితా సంపుటి, ఫిబ్రవరి, 2008). (సమాచారం: షేక్‌ అలీ, కావూరు)

ఫాతిమున్నీసా షేక్‌
కడప జిల్లా ప్రొద్దుటూరులో జననం. తల్లితండ్రులు: అయేషా

బీబి, డాక్టర్‌ ఖాశిం సాహెబ్‌. కలం పేరు: ఫాతిమా బద్దేలి, మున్నీ. చదువు: పదవ తరగతి. తండ్రి ప్రోత్సాహంతో ధార్మిక గ్రంథాలను అధ్యయనం చేసి ధార్మిక వ్యాసాలు రాయడం ఆరంభించారు. మొట్టమొదటి ధార్మిక వ్యాసం 'పర్దా ఔన్నత్యం' వ్యాసం 2004లో'గీటురాయి' వారపత్రికలో ప్రచురణ అయినప్పటి నుండి వివిధ ధార్మిక పత్రికలలో వ్యాసాలు,కథానికలు ప్రచురితం. లక్ష్యం: ఇస్లామీయ సత్య సందేశాన్ని సరళమైన తెలుగు భాషలోప్రజలకు చేర్చడం. చిరునామా: షేక్‌ ఫాతిమున్నీసా, ఇంటి నం. 7/4129/2, శ్రీనివాసనగర్‌, ప్రొద్దుటూరు-516360, కడప జిల్లా.

ఫజులుల్లా ఖాన్‌
గుంటూరు జిల్లా తేలప్రోలులో 1970 మే 27న జననం. తల్లి

తండ్రులు: షమీమా బేగం, కరీముల్లా ఖాన్‌. చదువు: ఎంఏ (ఆర్కియాలజీ)., ఎం.ఫిల్‌. ఉద్యోగం: జర్నలిజం. 1992లో సుప్రభాతం పత్రికలో వ్యాసాలు రాయడం ద్వారా రచనా వ్యాసంగం ఆరంభం. అప్పటినుండి వివిధ పత్రికలలో వ్యాసాలు, కవితలు ప్రచురితం. 'ప్రజాగళం' మాసపత్రిక (2006) సంపాదకులు. రచనలు: హజ్‌ యాత్ర (2009). అవార్డులు-పురస్కారాలు: బెస్ట్‌ సిటిజన్‌ అవార్డు (ఉయ్యాల కమ్యూనికేషన్స్‌, హైదారాబాద్‌, 2003), వికాస శిరోమణి అవార్డు (ఢిల్లీ తెలుగు ఆకాడమి, 2006), ఉగాది పురస్కారం (శ్రీ అన్నమయ్య కళాపీఠం, 2007), సర్‌ సయ్యద్‌ అహమ్మద్‌ ఖాన్‌ స్మారక ఆవార్డు (యునైటెడ్‌ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌, 2008). లక్ష్యం: ప్రజలను సామాజిక రుగ్మతల నుండి విముక్తం దిశగా చైతన్యపర్చడం. చిరునామా: ఫజులుల్లా

64