పుట:అక్షరశిల్పులు.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు

అడ్డగుంటపల్లిలో కుమారుని వద్దకు వచ్చి స్థిరపడ్డారు. తెలుగు, ఆంగ్లం, గుజరాత్‌, హిందీ, ఉర్దూ భాషలలో మంచి ప్రావీణ్యం గల ఆయన విద్యాబోధన గావిస్తూ, ఆయా భాషలలో

వెలువడిన ధార్మిక, సామాజిక, రాజకీయాంశాల మీద రాసిన పలు గ్రంథాలను అధ్యయనం చేసి సరళమైన తెలుగు భాషలోకి అనువదించారు. అంబేద్కరిజం, అంటరానితనం, సమానత్వం, మానవహక్కులు, ధర్మాచరణ తదితర అంశాలను ప్రధాన వస్తువులుగా స్వీకరించి కవితలు, కథలు, వ్యాసాలు రాశారు. ఆంగ్లంలో రాసిన వ్యాసాలు పత్రికల్లో చోటు చేసుకున్నాయి. కవులు, రచయితలు, పాత్రికేయుల సంఘాలతో మమేకమై పనిచేసిన షేక్‌ దౌలా రచనలు పివి నరసింహారావు, బెనారస్‌ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ వేదవ్యాస్‌, బిఎస్పినేత కాన్షిరాం లాంటి ప్రముఖుల ప్రశంసలను అందుకున్నాయి. చివరివరకు సాహిత్య సంస్థల సేవలో గడిపిన షేక్‌ దౌలా 2006 ఆగస్టు 30న అడ్డగుంటపల్లిలో కన్నుమూశారు. (సమాచారం: ఈనాడు దినపత్రిక, 30-09-2006, షేక్‌ దౌలా కుమారులు షేక్‌ మహమ్మద్‌ అతాఉల్లా, 2009 డిసెంబర్‌ 11, కరీంనగర్‌)

దౌలత్‌ బేగం
కృష్ణా జిల్లా మచిలీపట్నం. పుట్టిన తేది: 17-06-1937. చదువు:

బి.ఏ. అప్పటి చిరునామా: బి 11/యఫ్‌ 2, విజయనగర్‌ కాలనీ, హైదారాబాద్‌. రచనలు: అభిమానస్తులు (నవల), గేయాలు, కథలు. గుప్పెడంత మనస్సు, గేయాలు

ఫరీద్‌ సాహెబ్‌ షేక్‌ ఇఠలాపురం
గుంటూరు జిల్లా వినుకొండ జన్మస్థలం.

1890 ప్రాంతంలో జన్మించారు. శనగల వ్యాపారి. వినుకొండ పెదానాల్సా బజారులో

నివాసం. ఆశుకవిత్వం చెప్పడం, అష్టావధానాలలో పాల్గొనడంలో మంచి అభిరుచి చూపారు. 1949లో వినుకొండలో పోకూరి కాశీపత్యావధాని నిర్వహించిన అష్టావధానంలో వృచ్ఛకునిగా పాల్గొన్నారు. ప్రముఖ కవి పండితులు తుమ్మల సీతారామమూర్తి, బెజవాడ గోపాలరెడ్డి లాంటిపెద్దల సమక్షంలో పొన్నూరు, బాపట్ల, నెల్లూరు పట్టణాలలో పలు సత్కారాలు, సన్మానాలు పొందారు . పొన్నూరులో తుమ్మల నిర్వహించిన సన్మాన కార్యక్రమం సందర్భంగా 'మదురకవి' బిరుదుతో సత్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రంలోని నిర్వహించిన పలు సాహిత్యసభలలో పాల్గొన్నారు. చివరి క్షణంవరకు రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. రచనలు: ఇందిర, ఖండకావ్యం, గోరువంక,దక్షిణ గోగ్రహణము, వేమన, రిక్షావాలా లాంటి పద్య కావ్యాలు. వినుకొండలో కన్నుమూశారు.(సమాచారం: ప్రముఖ కవి కంచర్ల పాండురంగ శర్మ, 14-12-2009, వినుకొండ)

63