పుట:అక్షరశిల్పులు.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

ప్రచురితం. లక్ష్యం: సమాజశ్రేయస్సు. సామాజిక వాస్తవాలను, మనిషి హృదయ స్పందనలను సాహిత్యంలో ప్రతిబింప చేయాలన్నది. చిరునామా: దేవీప్రియ, ఫ్లాట్ నం.204, రాజకొండ టవర్స్‌, అల్వాల్‌, సికిందారాబాద్‌-10. సంచారవాణి: 9553586002, Email: devi@hmtv.in


దిలావర్‌ మహ్మద్‌ డాక్టర్‌
ఖమ్మం జిల్లా ఇల్లెందు తాలూక పాత కమలాపురంలో

1942 జూన్‌ ఐదున జననం. కలం పేరు : దిలావర్‌. తల్లితండ్రులు: మహబూబ్బి, మహ్మద్‌ నిజాముద్దీన్‌. చదువు: ఎంఏ., బి.ఇడి., పి.హెచ్‌డి. ఉద్యోగం: అధ్యాపకులుగా 2000లో విరమణ. ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు స్కూల్‌ మ్యాగ్ జైన్‌ 'ప్రగతి' కోసం 'తాజ్‌ మహాల్‌' కథ రాయడం ఆ తరువాత పదవ తరగతిలో 'ఆకలి' కథానిక రాయడం ద్వారా రచనా వ్యాసంగం ఆరంభం. తొలిసారిగా 1969 ఆంధ్రజ్యోతిలో 'నవ్వులు' కవిత ప్రచురితమైంది. అప్పటినుండి రాష్ట్రంలోని వివిధ పత్రికలలో కథలు, కవితలు, సాహిత్య వ్యాసాలు, సమీక్షలు, పరిశోధనాత్మక వ్యాసాలు ప్రచురితం. రచనా వ్యాసంగం పట్ల ఆసక్తి కలగడానికి ప్రధానంగా కౌముది (షంషుద్దీన్‌), ఆవంత్స సోమసుందరం కారణం కాగా శ్రీశ్రీ, తిలక్‌ పరోక్షంగా ప్రేరణ. ఆమెరికా తదితర దేశాలను పర్యటించిన సందర్భంగా ఆ దేశాల సాహిత్యంతో ఏర్పడిన పరిచయం దృష్ట్యా 20 దేశాలకు చెందిన సాహిత్య గ్రంథాలను సమీక్షిస్తూ రాసిన వ్యాసాలు పలు పత్రికల్లో చోటు చేసుకున్నాయి. రచనలు: 1.వెలుగు పూలు (1974), 2. వెన్నెల కుప్పలు (1980), 3.జీవన తీరాలు (1988), 4.కర్బలా (1999), 5.రేష్మా ... ఓ రేష్మా(కవితా సంపుటాలు, 2003), 6. గ్రౌండ్‌జీరో (దీర్ఘ… కవిత, 2003), 7. మచ్చు బొమ్మ(కదలసంపుటి, 2008), 8. ప్రణయాంజలి (పద్యకావ్యం,2001), 9.ప్రహ్లాదచరిత్ర-ఎఱ్రన- పోతన : తులనాత్మక పరిశీలన (1989), 11. లోకావలోకనం (సాహిత్యసమీక్షా వ్యాసాలు, 2010). నవలలు: 1.సమిధలు (భారతి, 1985), 2.ముగింపు (కథాకళి, 1996), 3.తుషార గీతిక (జయశ్రీ, 1981). ప్రజా సంఘాలు, సాహితీ సంస్థల సన్మానాలు పొందారు. లక్ష్యం: అభ్యుదయ భావాల ప్రచారం, మత సామరస్యాన్ని పతిష్టపర్చడం. చిరునామా:డాక్టర్‌ దిలావర్‌, ఇంటి నం: 565-11, సి కాంపస్‌, గాంధీనగర్‌, పాల్వంచ-507 154, ఖమ్మం జిల్లా. సంచారవాణి: 98669 23294.

దౌలు మహమ్మద్‌ షేక్‌
గుంటూరు జిల్లాలో 1925లో జన్మించారు. తల్లితండ్రులు:

షేక్‌ మహమ్మద్‌ హటేల్‌ సాహెబ్‌, రహమతున్నీసా. చదువు: ఎస్‌ఎల్‌సి. ఉద్యోగం నిమిత్తం గుజరాత్‌ వెళ్ళి 1980లో తిరిగి రాష్ట్రానికి వచ్చి కరీంనగర్ జిల్లా గోదావరిఖని

62