పుట:అక్షరశిల్పులు.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు


ఆయన తెలుగు భాషాభివృద్ధి ధ్యేయంగా పలు కార్యక్రమాలను నిర్వహించారు. తెలుగులోకి పలు ఇతర బాషా గ్రంథాలను అనువదించి ప్రచురించారు. చివరి దశ వరకు తెలుగులో

రచనలు గావించారు. రచనలు: చిత్త పరివర్తనము, దాసీపన్నా

(1956), రసూల్‌ ప్రభువు శతకము, సంస్కార ప్రయాణము

(1957), సూఫి సూక్తులు, సంత్‌వాణి, అల్లా మాలిక్‌ శతకము, సఖుడ (శతకం), క్రీడషదీశ్వరము, సాయి శతకము, సాయిబాబా దండకము, సాయిబాబా చరిత్ర (కావ్యము), అభినవ తిక్కన కవితా సమీక్ష (వచనం), నాగూర్‌ ఖాదర్‌ వలీ చరిత్ర, ఆజాదు చరిత్ర, ఆదర్శము (నవల), అబ్దుల్‌ ఖాదర్‌ జీలాని, గౌసుల్‌ ఆజం దస్తగిరి దివ్య చరిత్ర (వచనం), చంద్ర వదన మోహియార్‌ (ఖండ కావ్యము) కదిరి సమాధి గాథ తదితరాలు స్వతంత్ర రచనలు. తెలుగు అనువాదాలు: ఆశ్రుమాల (జయశంకర్‌ కృతికి అనువాదాం), అనంద కుమార (హిందీ మిలన్‌ అనువాదం).

దేవీ ప్రియ
గుంటూరు జిల్లా గుంటూరులో 1949 ఆగస్టు 15న జన్మించారు. అసలు

పేరు: షేక్‌ ఖాజా హుస్సేన్‌. తల్లితండ్రులు: షేక్‌ ఇమాంబీ, షేక్‌ హుస్సేన్‌ సాహెబ్‌. చదువు: బి.ఎ. కలంపేరు: దేవీప్రియ. వృత్తి: పాత్రికేయులు. చిన్నతనం నుండి సాహిత్యం పట్ల మక్కువ చూపిన ఆయన 1967 కథలు, కవితలు రాయడంతో ఆరంభించి కవిగా సుప్రసిద్దులయ్యారు. కవితలు, సాహిత్య వ్యాసాలు వివిధ పత్రికలు, సంకలనాలల్లో

ప్రచురితం. ఇతర భాషల్లోకి అనువాదమై ఆయా భాషా పత్రికల్లో

చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రముఖ దినపత్రికలలో పలు బాధ్యతలను నిర్వహించారు. ఆ సందర్భంగా పత్రికా ప్రపంచంలో నూతన ఒరవడులకు కారణమయ్యారు. 'ఉదయం' దినపత్రికలో నిర్వహించిన 'రన్నింగ్ కామెంట్రీ' పాఠకుల అదరణ పొంది పేరు తెచ్చిపెట్టింది. ఆ ప్రక్రియను ప్రస్తుతం వివిధ పత్రికల్లో పనిచేస్తున్న రచయితలు, కవులు అనుసరిస్తున్నారు. స్వయంగా 'మనోరమ' వారపత్రిక నడిపారు. 'హైదారాబాద్‌ మిర్రర్‌' దినపత్రికకు వ్యవస్థాపక ప్రధాన సంపాదకులుగా పనిచేశారు. ప్రస్తుతం 'హెచ్‌ఎం టివీ'లో సీనియర్‌ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 'ఉదయం' దినపత్రిక నాటి 'రన్నింగ్ కామెంట్రీ'ని 'హెచ్‌ఎంటివీ'లో దాశ్యీకరిస్తున్నారు. రచనలు: 1.సమజానంద స్వామి (1977), 2.అమ్మచెట్టు (1979), 3.నీి పుట్ట (1990), 4.గరీబు గీతాలు (1992), 5.తుఫాను తుమ్మెద (1999), 6.పిట్ట కూడ ఎగిరి పోవాల్సిందే (2002), 7.చేప చిలుక (2005), 8.గంధకుటి (2009), 9.ఇహాల్లహ్(పద్య కావ్యం) లు ఇంతవరకు

61