పుట:అక్షరశిల్పులు.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆచార్య షేక్‌ మస్తాన్‌ M.A (Tel).M.A.(Lit).Ph.D, అధ్యక్ష్యులు: ఆధునిక భారతీయ భాషల విభాగం అలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయం అలీఘర్‌, ఉత్తరప్రదేశ్‌.

                                     ముందు మాట

తెలుగు సారస్వత రంగానికి ముస్లింల సేవ అమూల్యం. అపురూప గ్రంథాలను అసంఖ్యాకంగా తెలుగు పాఠకులకు అందించారు. తెలుగు సాహిత్య రంగానికి వన్నెతెచ్చిన అవధాన ప్రక్రియను సైతం అలవోకగా నిర్వహిస్తూ, అద్బుతంగా పద్యరచన గావిస్తూ చక్కని విద్వత్తును, గొప్పధారణా శక్తిని ప్రదర్శించి పండితులు-ప్రజల చేత శబాష్‌ అన్పించుకున్నారు.

తెలుగు సాహిత్య క్షేత్రంలో పండుతున్న అన్నిరకాల సాహిత్య పంటలను పండించడం మాత్రమే కాకుండ సొంత బాణిలో 'రెక్కలు' లాింటి ప్రత్యేక సాహిత్య రచనా ప్రక్రియలకు అంకురార్పణ చేసి తెలుగు సాహిత్యరంగాన్ని సుసంపన్నం చేయడంలో తమదైన ప్రత్యేక భాగస్వామ్యాన్ని అందిస్తున్నారు. తెలుగు 'తల్లిబాష' కానప్పటికి తెలుగు భాష మీద మంచి సాధికారత సాధించి అద్బుతమైన ప్రతిభను ప్రదర్శించారు. ప్రతిభ అతీయంగా ఉన్నా, సృష్టించిన సాహిత్యం అనితర సాధ్యమైనా ముస్లిం కవులు, రచయితలకు తగినంత గుర్తింపు లభించడం లేదన్నది జగమెరిగిన సత్యం. తెలుగు వాఙ్మయ చరిత్రకారులకు, తెలుగు భాషా వైతాళికుల గ్రంథకర్తలకు తెలుగు ముస్లిం కవులు, రచయితల పట్ల చిన్నచూపుంది. తెలుగు సాహిత్య చరిత్రకారులు రూపొందించిన గ్రంథాలను పరిశీలిస్తే ముస్లిం కవులు, రచయితల పట్లగల 'వివక్ష-విస్మరణ' స్పష్టం అవుతుంది. బహుభాషా పండితులు, బహుగ్రంథకర్త, స్వాతంత్య్ర సమరయోధాులు, ఆధ్యాత్మిక గురువులు, ప్రజాప్రతినిధి, అవధాని, మహాకవి డాక్టర్‌ ఉమర్‌ అలీషాను పరిచయం చేయడనికి తెలుగు వాఙ్మయ చరిత్రకారులకు తమ గ్రంథాలలో సముచిత స్థానం దొరకలేదు. మౌల్వీ ఉమర్‌ అలీషా మాత్రమే కాదు తెలుగు సాహిత్య ప్రక్రియలన్నిటిలో తమదైన ప్రతిభను కనపర్చిన కవులు, రచయితలు షేక్‌ బుడన్‌ సాహెబ్‌, తక్కళ్ళపల్లి పాపా సాహెబ్‌, అచ్చుకట్ల