పుట:అక్షరశిల్పులు.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

చిత్రదుర్గ-577501, చిత్రదుర్గ జిల్లా, కర్నాటక రాష్ట్రం. సంచారవాణి: 096117 68747, 94407 04132 (పిపి).

బాషా మహబూబ్‌ షేక్‌
నెల్లూరు జిల్లా నందవరంలో 1961 మే 28న జననం.

తల్లితండ్రులు: షేక్‌ మహబూబ్‌బీ, షేక్‌ మస్తాన్‌ సాహెబ్‌. చదువు: బి.ఎ(లిట్)., ఎంఎ., బిఎ.ఎం.యస్‌. ఉద్యోగం: 'హైదారాబాద్‌ మిర్రర్‌' దినపత్రిక విజయవాడ ఎడిషన్‌ బాధ్యులు. 1979లో 'బీడిముక్క' కథానిక ఆంధ్రాపత్రిక దినపత్రికలో ప్రచురితం కావడం ద్వారా రచనా

వ్యాసంగం ఆరంభం. అప్పటి నుండి వివిధ పత్రికలలో కవితలు,

కథలు, కథానికలు, వ్యాసాలు ప్రచురితం. కొన్ని కథానికలు ఇతర భాషల్లోకి అనువదించబడి ఆయా భాషా పత్రికలలో ప్రచురితం అయ్యాయి. రచనలు: 1. చీకి మూసిన ఏకాంతం, 2. భారత నారీ బాధపడకు, 3. ప్రేమ పూజారులు, 4.ఎస్‌ నేనే, 5. ఆ రోజు..., 6. సమాజం కట్టిన సమాధాులు, 7. యుగధర్మం (నవలలు). 1984లో రాసిన 'చీకటి మూసిన ఏకాంతంలో' (నవల) పాఠకుల మన్నన పొందింది. 1985లో పురుష ద్వేషం పై స్త్రీల మనోభావాలను సృజిస్తూ రాసిన 'భారత నారీ బాధపడకు' (నవల) దాూషణ- భూషణలకు కారణమై గుర్తింపు తెచ్చి పెట్టింది. లక్ష్యం: సమాజాన్ని మానవత్వపు మూసలో పోయాలని. చిరునామా: షేక్‌ మహబూబ్‌ బాషా, ఇంి నం.10-146, ఎంబి వీధి, ఉదాయగిరి-524226, నెల్లూరు జిల్లా. సంచారవాణి: 94414 33786, Email: smbasha.sm@gmail.com

బాషా ఎస్‌.ఎం కడప జిల్లా సిద్దావట్టం గ్రామంలో 1950 జూలై 1 న జననం. తల్లి తండ్రులు: సయ్యద్‌ సాదిక్‌ బీ, సయ్యద్‌ ఫర్బుద్దీన్‌. కలం పేరు:

చందు. చదువు: బి.ఎ., బి.ఎల్‌. ఉద్యోగం: రాష్ట్ర ప్రభుత్వ

వ్యవసాయశాఖలో ఉద్యోగం ఐచ్ఛిక విరమణ తరువాత మానవ హక్కుల ఉద్యామకారుడిగా, రచయితగా స్థిరపడ్డరు. 1975లో 'జనపథం' పత్రికలో తొలి రచన ప్రచురితం. అనంతపురం జిల్లా ప్ర జ లు, ప్ర దానంగా రైతాంగ సమస్యలను విశ్లేషిస్తూ పరిశోధానాత్మక వ్యాసాలు వివిధా పత్రికలలో ప్రచురితం. ప్రజా సంఘాలు నిర్వహిస్తున్న ఉద్యామ పత్రికలకు రచయితగా చేయూత. రచనలు: 1. ఆరుగాలం, 2. అనంతపురం నీటి వనరులు. చిరునామా: ఎస్‌.ఎం. బాషా, ఇంటి నం. 4-2-582, యువజన కాలనీ, అనంతపురం-515001, అనంతపురం జిల్లా. సంచారవాణి: 94406 83555, Email: bashahrf_235@yahoo.co.in 54