పుట:అక్షరశిల్పులు.pdf/53

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

షేక్‌ ఖాదార్‌ బాషా, ఇంటి నం. 17-5-37, పీలాపోతు నాయుడు వీధి, గవరపాలెం, అనకాపల్లి- 531002, విశాఖపట్నం జిల్లా. సంచారవాణి: 92906 22644.

బజులుల్లా సాహెబ్‌
రాజమండ్రి నుండి వెలువడిన 'సత్యాంవేషి' పత్రికను స్థాపించి,

సంపాదాకత్వం వహించారు. వీరేశలింగం పంతులు నడిపిన 'సత్యసంవర్థని (1891- 1897) పత్రికలో వచ్చే వ్యాసాలను ఖండిస్తూ వ్యాసాలు రాశారు. ఈ పత్రికలలో వాదోపవాదాలు కడు తీవ్రంగా ఉండేవి.

బాషా హుసేన్‌ సయ్యద్‌: సయ్యద్‌ బాషా హుసేన్‌ ప్రకాశం జిల్లా మార్కాపురంలో

1939 మార్చి 31న జన్మించారు. తల్లితండ్రులు: సయ్యద్‌ అబ్దుల్‌ సలాం, మైమున్నీసా. గుంటూరు ఆంధ్రాక్రైస్తవ కళాశాలలో బి.ఏ చదువుతున్న సమయంలో మంచి నటుడిగా మాత్రమే కాకుండ మంచి నాటక రచయిత, కవిగా ఖ్యాతిగాంచారు. రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖలో ఉద్యోగం చేపట్టిన ఆయన కవితలు, కథానికలు ముఖ్యంగా నాికలు, నాటకాలు

అక్షరశిల్పులు.pdf

రాశారు. 'ఆశాజ్యోతి, ఆశాజీవులు, పసి హృదాయాలు, జీవన

కెరాలు, సమాజంలో స్త్రీ' నాటికలు మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఈ నాటికలు వందల ప్రదర్శనలకు నోచుకున్నాయి. కవితల ద్వారా వెల్లడించిన తన ఆభిప్రాయాలను 'గాయాలు-గేయాలు' కవితా సంకలం ద్వారా గ్రంథస్థం చేశారు. నాటక రంగంలో మంచి నటుడిగా ఖ్యాతిగాంచిన సయ్యద్‌ బాషా హుసేన్‌ చలన చిత్రాలలో కూడ నటించారు. స్వయంగా స్క్రిపును రూపొందించిన 'పెద్దింటి కోడలు', 'ఉత్తమురాలు' సినిమాల్లో నటించారు. అటవీ శాఖలో రేంజర్‌గా ఉద్యోగ విరమణ చేసిన సయ్యద్‌ బాషా హుసేన్‌ రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ సినిమాలకు రచయితగా సహకారం అందించారు. చివరి వరకు నాటకరంగం మీదా ఎక్కువగా దృష్టిసారించిన సయ్యద్‌ బాషా హుసేన్‌ (స్వగ్రామమైన) యర్రగొండపాలెంలో 2008 డిసెంబరు 13న కన్నుమూశారు. (సమాచారం: 'ఇండియా' మాసపత్రిక, 2008 జనవరి. ఇంటర్యూ: సయ్యద్‌ బాషా హుసేన్‌ కుమారుడు సయ్యద్‌ సాబిర్‌ హుసేన్‌, 2008 జనవరి 20, వినుకొండ.)

బాషా జాన్‌ ఎస్‌
కడప జిల్లా ప్రొద్దటూరు జన్మస్థలం. 1969 జూలై 19న జననం.

తల్లితండ్రులు : ఎస్‌. ఖాదార్‌ హుస్సేన్‌, ఎస్‌. మస్తానమ్మ. కవితలు, గేయాలు వివిధా కవితా సంకలనాలలో చోటుచేసుకున్నాయి. 2007 ఏప్రిల్‌లో కన్నుమూశారు.

బాషా మహబూబ్‌ షేక్‌
కడప జిల్లా పోరుమామిళ్ళలో 1976 నవంబరు 25న

జననం. తల్లితండ్రులు: ఫాతిమా బీబీ, మహబూబ్‌ సాహెబ్‌. చదాువు: ఎం.ఎ., ఎం.ఫిల్‌. 52