పుట:అక్షరశిల్పులు.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

అలీ ముహమ్మద్‌: కరీంనగర్‌ జిల్లా గుట్టు బత్తూరు. తల్లితండ్రులు: అమీనాబీ, హుస్సేన్‌. విద్యాభ్యాసం : యం.ఎ. కడపలో కో-ఆపరేటివ్‌ రిజిష్ట్రార్‌గా ఉద్యోగం. రచనలు: హృదయ మాధురి, ఆణిముత్యాలు, వేదనా సౌరభము, మమత (కావ్యాలు).

అలీ షేక్‌: గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా రమణప్పపాలెంలో 1935 డిసెంబర్‌ రెండున జననం. తల్లితండ్రులు: షేక్‌ మస్తాన్‌ బీ, మహమ్మద్‌ ఖాశిం సాహెబ్‌. చదువు: ఎం.ఎ., బి.ఇడి. ఉద్యోగం: తెలుగు అధ్యాపకులు. సంస్కృతాంధ్ర భాషలలో పండితులు. 1950 నుండి పద్య రచన ఆరంభం. రచనలు: శతకాలు: 1. మానస ప్రబోధము, 2. గురుని మాట (1970), 3. అజింఖాన్‌ బాబా (1990),

4.షిర్డి సాయి ప్రభు (1999), 5. ఖాదర్‌ బాబా (2001), 6. శిలువధారి (2003), 7. ఆంజనేయ (2003), 8. శ్రీ వాసవీ కన్యక (2008) 9. చెన్నకేశవ శతకం (2009). గద్యరచనలు: 10. రైతు బాంధవుడు (జీవితచరిత్ర) (2008), కావ్యాలు: 11. విధి విలాసము (1985), 12. ఆకాశవాణి (2000), 13. ఇందిరా భారతము, (2001), 14. వ్యాస మంజిరి, 1994 (వ్యాస సంకలనం) 15. సులభ వ్యాకరణము, 1993. సంపాదకుడిగా వెలువడిన గ్రంథాలు: 1. గురుదక్షిణ (1960), 2. కోగంటివారి భాషాసేవ (1962). బిరుదములు: కవితా వతంస, సద్భావనా కవిమిత్ర, పురస్కారాలు: కాట్రగడ్డ సాహితీ పురస్కారం, పట్నాయక్‌ నరసింహం ఫౌండేషన్‌ పురస్కారం. రాష్ట్రస్థాయి సాంస్కృతిక-సాహిత్య సంస్థలచే సన్మానాలు.చిరునామా: షేక్‌ అలీ, కావూరు-522611, చిలకలూరిపేట మండలం, గుంటూరు జిల్లా. సంచారవాణి: 93903 98044.

అలీ వలీ హమీద్‌ షేక్‌: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 1951జూన్‌ ఒకటిన జననం. తల్లితండ్రులు: షేక్‌ నాగూర్‌బీ, సుభాన్‌ సాహెబ్‌. 2004

నుండి రచనా వ్యాసాంగం ఆరంభం. పలు కవితలు, సమీక్షలు, సామాజిక వ్యాసాలు వివిధ పత్రికలలో, సంకలనాలలో చోటు చేసుకున్నాయి. పలువురి కవితలను ఆంగ్లంలోకి అనుదించారు. ఆంగ్లంలోకి అనువదించిన డాక్టర్‌ ఇక్బాల్‌ చంద్‌ (సత్తుపల్లి, ఖమ్మం) రాసిన 'ఆరోవర్ణం' కవితా సంపుటి మంచి గుర్తింపు తెచ్చింది. లక్ష్యం: బడుగు, బలహీన వర్గాల చైతన్యం కోసం రచయితగా కృషి. చిరునామా: ఎస్‌.వి.హెచ్‌ అలీ, టైప్‌ 3 ఎ/3, బిఎస్‌యన్‌ఎల్‌ స్థాఫ్‌ క్వార్టర్స్‌, లాలాచెర్వు, రాజమండ్రి-533106, తూర్పు గోదావరి. సంచారవాణి: 9441638651, Email: valishaik1971@gmail.com

42