పుట:అక్షరశిల్పులు.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు

అబ్దుల్‌ సత్తార్‌: కర్నూలు జిల్లా నంద్యాలలో 1937 జూలై ఒకిటిన జననం. తల్లి తండ్రులు: ఫఖ్రుబీ, హుస్సేన్‌ పీరాన్‌. చదువు: ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి.

ఉద్యోగం: రాష్ట్ర పోలీసుశాఖలో 1962లో చేరిక, 1990లో

విరమణ. కలం పేరు: మణి. 1974లో 'ఈనాడు' దినపత్రికలో ప్రచురితమైన కవిత ద్వారా రచనా వ్యాసాంగం ఆరంభం. వివిధా పత్రికలలో కవితలు, కథానికలు, గల్పికలు, ప్రధానంగా ధార్మిక వ్యాసాలు ప్రచురితం. మంచి వక్త, పలుటీవీ ఛానెల్స్‌లో ధార్మిక ప్రసంగాలు. తెలుగు పత్రికలలో ధార్మిక శీర్షికల నిర్వహణ. లక్ష్యం: దైవభీతి పునాదుల మీదా సత్సమాజ నిర్మాణానికి రచనల పరంగా చేయూత. చిరునామా: అబ్దుల్‌ సత్తార్‌, ఇంటి నం. 87-966/2, టెలికాం నగర్‌, కర్నూలు-518002, కరూflలు జిల్లా. సంచారవాణి: 92473 13496,

అబ్దుల్‌ వాహెద్‌: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 1972 ఏప్రిల్‌ 10న జననం. తల్లితండ్రులు: అఖ్తరున్నీసా బేగం, మహమ్మద్‌ సాబిర్‌. చదువు:

సాంకేతిక విద్యా. ఉపాధి: వెల్డింగ్ టెక్నీషియన్‌. 2003లో ప్రచు


రితమైన వ్యాసం ద్వారా రచనా వ్యాసాంగం ఆరంభం. అప్పటి నుండి వివిధ పత్రికలలో పలు ధార్మిక వ్యాసాలు ప్రచురితం. 2007 ఏప్రిల్‌లో రాసిన 'మానవజీవిత పరమార్థం' వ్యాసం గుర్తింపు తెచ్చింది. ఆకాశవాణిలో పలు ధార్మిక ప్రసంగాల ప్రసారం. స్వయంగా రూపొందించిన ధార్మిక ప్రసంగాల క్యాసెట్ వెలువడింది. లశ్యం: ఆధ్యాత్మిక దృష్టికోణం నుండి మానవత్వం నిజరూపాన్ని పూర్తి స్థాయిలో మనుషులకు ఎరుకపర్చాలన్నది. చిరునామా: అబ్దుల్‌ వాహెద్‌, ఇంి నం. 15-22-7/4, 18వ వార్డు, పాలూరి వారి వీధి, భీమవరం-534201.

అబ్దుల్లా ముహమ్మద్‌: నల్గొండ జిల్లా పెరిక కొండరంలో 1956 ఆగస్టు రెండున

జననం. తల్లితండ్రులు: సైదాబీ, ముహమ్మద్‌ ఖాశిం. కలంపేరు:

ఎండి చైతన్య (ఎండి. సౌజన్య స్పూర్తితో) చదువు: బి.ఏ. ఉద్యోగం: రాష్ట్ర పోలీసుశాఖ, (సంపాదాకులు: 'సురక్ష ' మాసపత్రిక). 1972లో 'యువజన' మాసపత్రికలో ప్రచురితమైన 'వృక్షం' కవిత ద్వారా రచనా వ్యాసంగం ఆరంభమై వివిధా పత్రికలలో కవితలు, కథాలు, వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు చోటు చేసుకున్నాయి. పలునాటికలు ఆకాశవాణి, దూరదర్శన్‌లలో ప్రసారం. రచనలు:

37