అబ్బాదాుల్లా కడప జిల్లా కొమ్మర్ల కాల్వ గ్రామంలో 1937 నవంబరు 24న రసూల్‌బి, షేక్ మహబూబ్ సాహెబ్‌లకు జన్మించారు. బిఎ (ఆనర్స్) చేసి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగంలో చేరి రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో పనిచేశారు. 1976లో రచనా వ్యాసంగాన్ని ఆరంభించి 'ధార్మ సంస్థాపన' అనువాద గ్రంథాన్ని ప్రచురించారు. ఆ క్రమంలో 20కి పైగా ఉర్దూ ఆథ్యాత్మిక గ్రంథాలను తెలుగులోకి అనువదించారు.
1992లో 'ఇస్లాం ప్రబోధిని' (నాలుగు సంపుటాలు) అనువాద గ్రంథం మంచి పేరు తెచ్చిపెట్టింది. ధార్మిక, సామాజిక అంశాల మీదా వ్యాసాలు రాశారు. 'తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్' సంస్థకు సంచాలకులుగా పది సంవత్సరాలు బాధ్యాతలు నిర్వహించారు. ప్రింటు ఎలక్ట్రా ని క్ మీడి యా లో యువత కు అవకాశాలు కల్పించాలన్న లకక్ష్యంతో 'తెలుగు స్కూల్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్' సంస్థను ఆరంభించి 2009 వరకు మార్గదర్శకం వహించారు.'గీటురాయి' వారపత్రికను దినపత్రికగాతీర్చిదిద్దాలన్నసంకల్పంతో ప్రయత్నించారు. 2009 సెప్టెంబర్ 27న అబ్బాదాుల్లా హైదారాబాద్‌లో కన్నుమూశారు.
వరంగల్ జిల్లా జాఫర్‌నగర్ మండలం తమ్మడపల్లి గ్రామంలో 1975 జనవరి 16న జన్మించారు. తల్లి తండ్రులు : మొహిద్దీన్‌బీ, ఇస్మాయిల్ సాహెబ్. చదువు: బి.ఎ. వ్యాపకం: సామాజిక కార్యకర్త. 1975లో సాహిత్య రంగ ప్రవేశం. కవితలు, వ్యాసాలు
ప్రచురితం. రచనలు: 'భారత దేశం ముస్లింల ఆర్థిక సామాజిక, విద్యా స్థితిగతులు' (జస్టిస్ రాజేంద్ర సచార్ కమిటీ నివేదిక సంక్షిప్త అనువాదాం), లక్ష్యం: సమసమాజం దిశగా ప్రజలను చైతన్య వంతుల్ని చేయడం. చిరునామా: ఎం.డి అబ్బాస్, 1-7-139/ 44, ఎన్.వి.బి. స్మారక కేంద్రం, ఎస్.ఆర్.కె.నగర్, రిసాలగడ్డ, జమిస్తాన్‌పూర్, హైదారాబాద్-500020, సంచారవాణి: 99599 05016. Email: mohammedabbas @yahoo.com
29