పుట:అక్షరశిల్పులు.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

భారత స్వాతంత్యోద్యమం: ముస్లిం మహిళలు

స్వాతంత్రోద్యమంలో పాల్గొని విశిష్ట త్యాగాలతో, అపూర్వ ధైర్య సాహసాలతో ఆంగ్లేయుల మీద ఉద్యమించిన ముస్లిం మహిళల జీవితగాథలను దృశ్శీకరిస్తూ 1857 నుండి 1947 వరకు సాగిన వివిధ పోరాటాలలో భాగస్వాములైన 61 మంది విశేషాలను విశదీకరిస్తుందీ గ్రంథం. (తృతీయ ప్రచురణ,1/8 డెమ్మీ సైజు, పేజీలు:286, మల్టికలర్‌ టైిల్‌, వెలó రు.160)

భారత స్వాతంత్య సంగ్రామం: ముస్లింయోధులు -1 1757 నుండి బ్రిటిషర్ల పెత్తనానికి వ్యతిరేకంగా సాగిన ప్రజా పోరాటాల నుంచి, ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం, జాతీయోద్యమంలో పాల్గొని ఆంగ్లేయులతో తమదైన మార్గంలో తలపడిన, ఉద్యమాలు సాగించిన 35 మంది యోధుల విశేషాలు, చిత్రాలతో తెలియజేస్తుందీ గ్రంథం. (ద్వితీయ ప్రచురణ,1/8 డెమ్మీ సైజు, పేజీలు: 316, మల్టికలర్‌ టైటిల్‌, వెల: రు. 200)

చిరస్మ రణీయులు

1757 నుండి 1947 వరకు సాగిన బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటాలలో పాల్గొన్నవంద మంది ముస్లిం పోరాట యోధాుధుల జీవిత రేఖాచిత్రాలు, వారి అమూల్యమై ఫొటోలు, చిత్రాలు ఉన్నాయి. అలనాటి యోధులలో వందమంది సాహసోపేత త్యాగపూరిత చరిత్ర వివరిస్తుందీ పుస్తకం. (ద్వితీయ ప్రచురణ,1/8 డెమ్మీ సైజు, పేజీలు: 224, మల్టికలర్‌ టైటిల్‌, వెల: రు. 100)

1857: ముస్లింలు ప్రథమ స్వాతంత్య్ర సంగ్రాంలో ముస్లింలు సాగించిన పోరాటాన్ని, ఆనాడు వ్యక్తమైన హిందూ-ముస్లింల ఐక్యతను, ఆంగ్లేయుల క్రూరత్వం, త్యాగాలు ఒకరు చేస్తే భోగాలు మరొకరు అనుభవిస్తున్న తీరు, విస్మరణకు గురైన ముస్లింల త్యాగాలను సరికొత్త కోణం నుండి చర్చకు పెట్టిన విమర్శనాత్మక చరిత్ర గ్రంథమిది. (ప్రథమ ప్రచురణ,1/8 డెమ్మీ సైజు, పేజీలు: 304, మల్టికలర్‌ టైటిల్‌, వెల: రు. 200)

ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ శివప్రసాద్‌ వీధి, కొత్తపేట, వినుకొండ - 522647, గుంటూరు జిల్లా దూరవాణి : 94402 41727, 93964 29722

178