పుట:అక్షరశిల్పులు.pdf/172

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అక్షరశిల్పులు

అనుబంధం: 3

(తెలుగులో రాసిన/రాస్తున్న ముస్లిం కవులు-రచయితల సమాచారాన్ని పంపాల్సిందిగా కోరుతూ పత్రికలకు విడుదల చేసిన ప్రకటన) గత తొమ్మిదేండ్లుగా 'భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ముస్లిం జనసముదాయాల పాత్రను' వివరిస్తూ పలు చరిత్ర గ్రంథాలను ప్రచురించి పాఠకులకు అందించిన 'ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ ' తెలుగులో సాహిత్య సృష్టి గావించిన/గావిస్తున్న ముస్లిం కవులు, రచయితల, అనువాదకుల వివరాలతో కూడిన 'డైరక్టరీ' రూపొందించాలని సంకల్పించింది.

ఈ ప్రయత్నం మూడేండ్ల క్రితం చేసినా తగిన ప్రచారం, సంబంధితుల నుండి తగినంత స్పందన లేకపోవటంతో అప్పట్లో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాం. గత కొద్ది కాలంగా పలువురు పెద్దలు, మిత్రులు రాష్ట్రంలోని కవులు, రచయితల వివరాలతో కూడిన డైరెక్టరీ రూపొందించాల్సిన అవసరముందంటూ, ఆ ప్రయత్నం మళ్ళీ చేయ మని సూచిస్తున్నారు.

ఆ సలహ/సూచనల మేరకు రాష్ట్రంలోని ముస్లిం కవులు, రచయితలు, అనువాదకులు తమ వ్యక్తిగత, వృత్తి, ప్రవృత్తి, సాహిత్య రంగాలలో వ్యక్తిగత కృషిని -ప్రగతిని, ఆయా రంగాలలో క్రియాశీలక భాగస్వామ్యాన్ని, ప్రచురితమైన గ్రంథాలు, అవి ఇతర భాషలలో అనువాదమై ఉంటే ఆ విశేషాలను, అలాగే లభించిన అవార్డులు, పురస్కారాలు, అభినందనలు, జరిగిన సన్మానాలు తదితర వివరాలను సవివరంగా పేర్కొంటూ, రెండు పాస్‌పోర్టు సైజు ఫోలతో సహా సమగ్ర సమాచారాన్ని, బయోడేటా రూపంలో 2008 మే30 లోగా ఈ క్రింది చిరునామాకు అందేలా పంపించగలరు. రాష్ట్రంలోని వివిధ పత్రికలలో తమ గురించి, తమ రచనల గురించి ప్రచురితమైన పరిచయ వ్యాసాలు, సమీక్షా వ్యాసాలు, తమ గ్రంథాలు, ఆ గ్రంథాల మీద వచ్చిన సమీక్షల జిరాక్స్‌ కాపీలను కూడాపంపితే కవుల-రచయితల పరిచయాలు సమగ్రంగా రూపొందించడానికి వీలుంటుంది. గడువు తేదీ కంటె ముందుగా వివరాలు అందితే డైరక్టరీ ప్రచురణ సౌలభ్యంగా ఉంటుందని మిత్రులు గ్రహించగలరు.

ఈ డైరక్టరీని రాష్ట్రంలోని ప్రభుత్వ-ప్రభుత్వేతర ప్రముఖ గ్రంథాలయాలకు, విశ్వవిద్యాలయాలకు, సాహితీ సంస్థలకు సమాచార వ్యవస్థలకు 'ఉచితంగా' అంద చేయాలన్నది మా నిర్ణయం.'

మార్చి, 2008 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌,

వినుకొండ. 171

8