పుట:అక్షరశిల్పులు.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తీసుకుని వారి రచనలు ఆకాశవాణి, టీవీ ఛానెల్స్‌లో ప్రసారమైఉన్నా, ప్రజా బాహుళ్యం సమక్షంలో పలుమార్లు ప్రదర్శించి ఉన్నా అటువంటి సాహిత్య ప్రక్రియలను రూపొందించిన రచయితలు, కవులను కూడ 'అక్షరశిల్పులు' లో స్థానం కల్పించాలన్న విధానాన్ని రూపొందించుకుని, పాించాను.

పుస్తకం గురించి :

ఈ పుస్తకంలో మొత్తం మీద 333 కవులు, రచయితలు, అనువాదకుల వివరాలను పొందుపర్చగలిగాను. అక్షరశిల్పులు కోసం 2008 మార్చిలో ప్రకటన విడుదల చేసినప్పటి నుండి చివరి వరకు సుమారు 242 మంది నేరుగా వివరాలు పంపారు. ఈ విధంగా నేరుగా నాకు అందిన, నేను ఇతర గ్రంథాల నుండి సేకరించిన వారి పూర్తి వివరాలను 'ఇందులోని కవులు, రచయితల జాబితా' లో పేర్కొన్నాను. ఈ కవులు, రచయితలు, అనువాదాకులను సాధారణంగా ఏ పేరుతోనైతే పిలుస్తుంటారో ఆ పేర్లను పరిగణలోకి తీసుకుని ఆంగ్ల భాషలోని అక్షర క్రమం ప్రకారం వరుసగా పొందుపర్చాను. ఈ వివరాలు కాకుండ నాకు అందని, నాకు లభించని మరికొందరి కవులు, రచయితల రచనలు వివిధ గ్రంథాలలో ప్రచురితమై ఉన్నదున అటువంటి వారి వివరాలను కూడ ఆయా గ్రంథాలనుండి సేకరించాను. ఆ వివరాలను రచయిత పేరు, రాసిన కవిత/వ్యాసం శీర్షిక, అది ప్రచురితమైన గ్రంథం, ఆ గ్రంథంసంకలనకర్త/ ప్రచురణకర్త తదితర వివరాలను 'అనుబంధం-1' క్రిందపపట్టిక రూపంలో ఇచ్చాను. అక్షరశిల్పులు కోసం సమాచారం కోరుతూ విడుదల చేసిన ప్రకటనను 'అనుబంధం -2' గా, సమాచారం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన 'ప్రొఫార్మా' 'అనుబంధం-3' గా పాఠకుల సమాచారం నిమిత్తం పేర్కొన్నాను.

ధన్యవాదాలు :

నా ప్రయత్నాలకు చేయూతనిస్తూ నేను విడుదల చేసిన ప్రకటనను తమ జిల్లాలలోని వివిధా దినపత్రికల్లో ప్రచురితమయ్యేట్టు శ్రద్ధ తీసుకోవడం మాత్రమే కాకుండ, ఆయా జిల్లాల నుండి వెలువడుతున్న ప్రాంతీయ పత్రికలలో కూడ ఈ ప్రకటన ప్రచురితం అయ్యేట్టు మిత్రులు సయ్యద్‌ అబ్దుల్‌ సమద్‌ (నంద్యాల, కర్నూలు), షేక్‌ మహబూబ్‌ జాన్‌ (ఒంగోలు, ప్రకాశం), హబీబుర్‌ రెహమాన్‌ (విజయవాడ, కృష్ణా), ఎం.ఎ అఫ్జల్‌ (చాగల్లు, గోదావరిజిల్లాలు), సయ్యద్‌ మక్సూద్‌ (జహీరాబాద్‌, మెదక్‌), ఎం.డి ఫశీవుద్దీన్‌ (విశాఖపట్నం), ఎం.డి నజీరుద్దీన్‌ (నల్గొండ), షేక్‌ అబ్దుల్లా (శ్రీకాకుళం), వై.ఫక్రుద్దీన్‌ (అనంతపురం),శ్రీమతి సాజిదా సికిందర్‌ (మహబూబ్‌నగర్‌), సికిందర్‌ అలీఖాన్‌ (మదనపల్లి, చిత్తూరు),షేక్‌ అబ్దుల్‌ షుకూర్‌ (నెల్లూరు), షేక్‌ మగ్బూల్‌ బాషా (కడప), షేక్‌ అబ్దుల్‌ అజీద్‌