పుట:అక్షరశిల్పులు.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

'కవర్‌పేజీ కదనం' శీర్షికన రాసిన, 'ప్రత్యేక కదనం' శీర్షికలతో సమకాలీన సమస్యలు-అంశాల మీద వ్యాసాలు అందించారు. అలాగే మాత్రా చందాస్సులతో ప్రతివారం రాసిన 'వారెవా' పాఠకులను ఆకట్టుకున్నాయి. ఆకాశవాణి, దూరదర్శన్‌,టి వి ఛానెల్స్‌లో పలు ధార్మిక,

సామాజిక ప్రసంగాలు ప్రసారం. 'సంస్కతిృ టి వి'లో ఇస్లాం

విభాగం నిర్వాహకునిగా బాధ్యతల నిర్వహణ. రచనలు: 1. మానవసేవ, 2. టెర్రరిజం-ఇస్లాం బోధనలు, 3. సామాజిక న్యాయం ఇస్లాంలోనే సాధ్యం, 4. ఇస్లాం ఉగ్రవాదానికి వ్యతిరేకం, 5. మానవుల్లో సోదర భావం, 6. శాంతి ఎలా స్థాపితం అవుతుంది?, 7. నిన్ను నీవు తెలుసుకో, 8. స్వీయ సంస్కరణ, 9. బాల శ్రామికులు, 10. మానవులంతా ఒక్కటే, 11. ఉమ్మడి కుటుంబం-ఇస్లాం, 12. బహు భార్యత్వం - ఎప్పుడూ? ఎందుకు?, 13. యదార్ధాల అద్దంలో కామన్‌ సివిల్‌ కోడ్‌ (ఉర్దూ నుండి అనువాదాలు) 14. అంతరిక్ష అధ్యయనం-దివ్య ఖురాన్‌, 15. స్ప్రింగ్ బోర్డు (ఆంగ్లం నుండి అనువాదాలు). లక్ష్యం: సామాజిక ప్రయోజనం. ప్రతి పదార్థ వివరణతో ఖుర్‌ఆన్‌ గ్రంథాన్ని పూర్తిగా అనువదించాలన్నది. చిరునామా: అబ్దుల్‌ వాహెద్‌, సందేశ భవనం, లక్కడ్‌ కోట్, ఛత్తా బజార్‌, హైదారాబాద్‌- 500002, సంచారవాణి: 93465 02954, 93944 86084.

యాకూబ్‌ షేక్‌ డాక్టర్‌
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రొట్టమాకు రేవులో

జననం. తల్లితండ్రులు: హురూన్‌ బీ, షేక్‌ ముహమ్మద్‌. కలంపేరు: యాకూబ్‌. చదువు: బి.కాం., ఎం.ఏ(తెలుగు).,టిపిటి., యం.ఫిల్‌., పిహెచ్‌.డి. ఉద్యోగం: అధ్యాపకులు.

(అంవారులూం డిగ్రీ కళాశాల, హైదారాబాద్‌). 1984లో ప్రజాశక్తి

దినపత్రికలో 'నేను' కవిత ప్రచురితం కావడంతో రచనా వ్యాసంగం ఆరంభం. అప్పటి నుండి వివిధ పత్రికలలో, సంకలనాలలో కవితలను, గేయాలు, సాహిత్య -విమర్శనా వ్యాసాలు, కథలు చోటు చేసుకున్నాయి. పలు కవితలు ఆంగ్లం, హిందీ, తమిళం, కన్నడం, మళయాళం, ఫ్రెంచ్‌ భాషల్లో అనువాదమై ఆయా భాషా పత్రికల్లో స్థానం సంపాదించుకున్నాయి. 'ప్రవహించే జ్ఞాపకం (కవిత, 1992), తెలంగాణా సాహిత్య విమర్శ (2008), తెలుగు సాహిత్య విమర్శలో రా.రా మార్గం (పరిశోధనా వ్యాసం, 1991), మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఉర్దూ, హిందీ, కొంకణి, కశ్మీరి భాషల్లోని కవితలను, గేయాలను తెలుగులోకి అనుదించారు. హిందీ టివి సీరియల్స్‌ 'మహాభారతం' (1988 -1989), టిపూ సుల్తాన్‌ (1989), పరమ వీరచక్ర (1989) లను 'ఉదయం' దినపత్రికలో

158