పుట:అక్షరశిల్పులు.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు


వివిధ హోదాలలో బాధ్యతలు నిర్వహించారు. ఆయన రాసిన 'ఈనాడు ఏనాడు నిజం రాయదు' వ్యాసం అప్పట్లో సంచలన సృష్టించింది. 1976 ఎమర్జన్సీ సమయంలో మానవహక్కుల ఉల్లంఘన ప్రధానాంశంగా 'సంకెళ్ళలో భారత దేశం' గ్రంథాన్ని వెలువరించి ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యారు. అరెస్టు నుండి తప్పించుకోడానికి ఎనిమిది మాసాలు అజ్ఞాతంగా గడపాల్సి వచ్చింది. చలన చిత్రాలకు మాటలు, పాటలు రాశారు. హాస్యనటుడు రాజబాబు నటించిన 'ఎవరికి వారే యమునా తీరే' సినిమాకు కథ రాయడమే కాకుండామాటలు కూడాసమకూర్చారు.

ఆకాశవాణిలో కొంత కాలం పలు బాధ్యాతలను నిర్వహించారు. గుంటూరు జిల్లాలో మాత్రమే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వెలువడిన తెలుగు, ఆంగ్ల చిన్నపత్రికలకు మార్గదర్శకం వహించడం మాత్రమే కాకుండా ఆ పత్రికల మనుగడ కోసం వివిధ అంశాల మీద వ్యాసాలు రాసి పంపి సహకారం అందించారు. ఆర్థిక అవసరాల కోసం చాలా మందికి 'ఘోస్టు రైటర్‌'గా రచనలు అందించారు. మాటపూర్వకంగా గాని, రాతపూర్వకంగా గాని ఎవరి మెహర్బానీ కోసం కాకుండా నిర్భయంగా, నిష్కర్షగా తన అభిప్రాయాలను ప్రకటిస్తూ వచ్చిన ఆయన రాష్ట్ర జర్నలిస్టులకు, రచయితలకు 'ఎస్‌.ఎంవలి'గా పరిచయం. పెద్దపత్రికలు, చిన్నపత్రికలు ఆని కాకుండా అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏ సమయంలోనైనా సీనియర్‌ రచయిత, జర్నలిస్టుగా సమాచార సహకారం అందించిన సయ్యద్‌ మస్తాన్‌ వలి 2007 అక్టోబరు 29న గుంటూరులో కన్నుమూశారు. (సమాచారం: ఎస్‌.ఎం.వలి కుమారుడు, సయ్యద్‌ మీరా హుస్సేన్‌, న్యాయవాది, 06-08-2008, హైదారాబాద్‌.)

వజీర్‌ రహమాన్‌
కాకినాడ. చదువు: ఎం.ఎ. రచనలు: ఎచటకి పోతావీరాత్రి?. కవిగా చలం, సాహసి, గేయకవితలు.
వాహెద్‌ అబ్దుల్‌
పశ్చిమ గోదావరి జిల్లా గుండుగొలనులో 1966 లై24న జననం. తల్లితండ్రులు: నూర్జహాన్‌, ముహమ్మద్‌ షఫీ. కలం పేర్లు: వాహెద్‌, ఇబ్నె షఫి, రఫీఖ్‌, చదువు: బి.ఏస్సీ. వృత్తి: జర్నలిజం. ప్రస్తుతం 'హెచ్‌.ఎం.టివీ'లో (హైదారాబాద్‌)

బాధ్యతల నిర్వహణ. ఆంగ్లం, హిందీ, ఉర్దూ, అరబిక్‌, తెలుగు భాషలలో ప్రవేశం. 1988లో తొలి సారిగా 'జనత' దినపత్రికలో ప్రచురితమైన వ్యాసం ద్వారా రచనా రంగ ప్రవేశం. అప్పటినుండి వివిధ పత్రికల్లో సామాజిక- రాజకీయ-ధార్మిక వ్యాసాలు, కవితలు, కథానికలు ప్రచురితం. 1988లో హైదారాబాద్‌ వచ్చి 'గీటురాయి' వారపత్రికలో 20 ఏండ్ల పాటు సహాయ సంపాదాకులుగా బాధ్యాతలను నిర్వహణ. ఈ పత్రికలో వారం వారం ప్రత్యేకంగా

157