పుట:అక్షరశిల్పులు.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు


ఆంగ్లంలోకి అనువాదమై 2008లో వెలువడింది. 1996 నుండి 'తత్వజ్ఞానం' ఆధ్యాత్మిక మాసపత్రిక సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు. అవార్డులు- పురస్కారాలు: డాక్టర్‌ రామినేని పురస్కారం (హైదారాబాద్‌, 2006), 'భరతమాత ముద్దుబిడ్డ' అవార్డు (మదర్‌ ఇండియా ఇంటర్నేషనల్‌, 2010), గ్లోబల్‌ హెల్త్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ ఫౌండేషన్‌ అవార్డు (న్యూఢిల్లీ, 2010), కిన్నెర అర్ట్‌ ధియేటర్స్‌ ఉగాది పురస్కారం (హైదారాబాద్‌,2010) లక్ష్యం: సర్వమత సామరస్యం. ప్రజల మధ్య సధ్భావన-సదావగాహన పెంపొందించడం ద్వారా సమాజంలో ఐక్యతాభావనను, శాంతిని సుస్థిరం చేయడం. చిరునామా : డాక్టర్‌ ఉమర్‌ అలీషా, ఇంటి నం.11.3.42, ప్రదాన రహదారి, పిఠాపురం-533450, తూర్పుగోదావరి జిల్లా, దూరవాణి: 08869-251769, 98489 24599. Email: dr_umaralisha@yahoo.com.

ఉమర్‌ అలీషా మౌల్వీ
మౌల్వీ ఉమర్‌ అలీషా 1885 ఫిబ్రవరి 28న, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జన్మించారు. తల్లితండ్రులు: చాంద్‌బీబి, మౌల్వీ మొహిద్దీన్‌ బాద్షా.

చదువు: ఉన్నత పాఠశాల విద్యానంతరం తండ్రి, ఇతర పండితుల వద్ద విద్యాభ్యాసం చేశారు. తెలుగు, ఉర్దూ, అరబ్బీ, పర్షియన్‌, హిందీ, సంస్కృత భాషలలో పట్టు సంపాదించిన ఆయనకు ఆంగ్ల భాషతో పరిచయం ఉంది. చిన్నతనంలోనే మంచి విద్వత్తు ప్రదర్శిస్తూ 14వ ఏట నుండి కవిత్వం చెప్పడం మొదలెట్టిన ఉమర్‌ అలీషా 18వ ఏటనే నాటకాలు

రాయడం ఆరంబించి, 1905 ప్రాంతంలో 'మణిమాల'

(గద్య-పద్యాత్మక నాటకం) వెలువరించారు. చిన్నతనం నుండి రచనా వ్యాసంగంలో నిమగ్నమైన ఉమర్‌ అలీషా అసంఖ్యాకంగా రాశారని తెలుస్తుంది. డాక్టర్‌ ఉమర్‌ అలీషా మొత్తం మీద 108 గ్రంథాలు రాశారని ఆంధరా విశ్వవిద్యాయలం హిందీ విభాగానికి చెందిన ఆచార్య యస్‌.యం ఇక్బాల్‌ ప్రకటించారు. 1970లో డాక్టర్‌ ఉమర్‌ అలీషా మీద పరిశోధానా పత్రం సమర్పించేందుకు, సమాచార సేకరణ జరుపుతున్నసమయంలో, మౌల్వీ చేతిరాతలో ఉన్న పలు గ్రంథాలను తాను చూచినట్టు 2005 ఆగష్టు 6న 'అక్షరశిల్పులు' కూర్పరితో ప్రోఫెసర్‌ ఇక్బాల్‌ స్యయంగా చెప్పారు. 1926-28లలో డాక్టర్‌ ఉమర్‌ అలీషా తెలుగులోకి అనువదించిన ఉమర్‌ ఖయ్యూం రుబాయిలను 'ఉమర్‌ ఖయ్యూం రుబాయీల అనుశీలన' అను శీర్షికతో 1980లో నాగార్జున విశ్వవిద్యాలయంలో సిద్దాంత వ్యాసం సమర్పించిన డాక్టర్‌ షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా (కడప) 'అరవై ఏళ్ళల్లో దాదాపు 50 కృతులు...రచించార'ని వెల్లడించారు. మౌల్వీ ఉమర్‌ అలీషాతో పరిచయమున్నపిఠాపురం నివాసి, ప్రముఖ కవి డాక్టర్‌ అవంత్స సోమసుందర్‌, 2007 సెప్టెంబర్‌ 14న మాట్లాడుతూ ఉమర్‌ అలీషా అసంఖ్యాకంగా గ్రంథాలు రాసినా, వెలువరించినా అవన్నీ ప్రస్తుతం లభ్యం

153