పుట:అక్షరశిల్పులు.pdf/150

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అక్షరశిల్పులు


అంతర్జాతీయ స్థాయి గుర్తింపును తెచ్చి పెట్టింది. లక్ష్యం: శాంతి...శాంతి...శాంతి, అందునా ప్రపంచ శాంతి. చిరునామా: ముహమ్మద్‌ సిరాజుద్దీన్‌, ఇంటి నం. 24-2-113, దర్గా ఖాజీపేట, వరంగల్‌-506004, వరంగల్‌ జిల్లా. సంచారవాణి: 99497 10085, దూరవాణి: 0870-2430805.

సుబహాన్‌ అబ్దుస్‌ కె.యం
నెల్లూరు జిల్లా నెల్లూరు పట్టణంలో 1956 జులై ఒకిటిన జననం. తల్లితండ్రులు: ఖాజా బీబి, మియా జాన్‌. చదువు: ఇంటర్‌. ఉద్యోగం: ఉపాధ్యాయులు. 1983లో రాసిన 'ప్రజల రక్త మాంసాలతో...' కవిత 'రాడికల్‌ మార్చ్‌'

పత్రికలో ప్రచురితం అయినప్పటి నుండి వివిధ పత్రికల్లో, సంకలనాల్లో పలు వ్యాసాలు, కదలు, గేయాలు, కవితలు చోటుచేసుకున్నాయి. పిల్లల విద్యాభ్యాసంలో సృజనాత్మకను పెంపొందించాలన్న లక్ష్యయంతో

అక్షరశిల్పులు.pdf

బాలల కోసం రాసిన పలు కథలు, ఇస్లామిక్‌ వ్యవస్థ-చరిత్ర ఔన్నత్యాన్ని వివరిస్తూ వివిధ కోణాల నుండి రాసిన వ్యాసాలు, 'గీటురాయి' వారపత్రికలో ధారావాహికంగా ప్రచురితం . 'ఖిలాఫత్‌-రాజరికం', 'ఔరంగజేబు మత ఛాందసవాది కాదు', 'మానవజాతికి అభ్యుదయానికి ఇస్లాం అత్యవసరం' లాంటి వ్యాసాలు గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఉర్దూ, తెలుగులో పాటలు రాయడం శ్రావ్యంగా పాడటం అభిరుచి. ఈ మేరకు పలు టివీ ఛానెల్స్‌, ఆకాశవాణిలో స్వయంగా రాసి పాడిన పాటలు ప్రసారం అయ్యాయి. రచనలు: 1. విజయానికి ఏకైక మార్గం ఇస్లాం (2008), 2. హిందూ ధర్మగ్రంథాల్లో ప్రవక్త మహమ్మద్‌ (2009), 3. ఇస్లాం మానవజాతికి అత్యవసరం (2010), ఇస్లామీయ ఉద్యమం-స్థబ్దత (2010). లక్ష్యం: ప్రపంచంలో శాంతి-సంక్షేమ సమాజ స్థాపనకు ఇస్లామీయ ప్రాంపంచిక జీవన విధానం ఒక్కటే శాస్రీయమైనదన్న వాస్తవాన్ని ప్రచారం చేయడం. చిరునామా: క.యం.అబ్దుస్‌ సుబహాన్‌, ఇంటి నం. 25-1-1991, ప్రగతి నగర్‌, 'ఏ' బ్లాక్‌, 8వ వీధి, నెల్లూరు-4, నెల్లూరు జిల్లా.సంచారవాణి: 94907 78602.

సుభాని మహబూబ్‌ షేక్‌
గుంటూరు జిల్లా గుంటూరులో
అక్షరశిల్పులు.pdf

1961 మే 31న జననం. తల్లితండ్రులు: షేక్‌ పాతిమూన్‌, సులేమాన్‌. చదువు: బి.కాం., బి.ఎల్‌.ఐ.ఎస్సీ., ఎం.ఏ. ఉద్యోగం: గ్రంథాలయాధికారి (జిల్లా గ్రంథాలయం, గుంటూరు). 1977లో 'ఇజాలు' కవిత ఆంధ్రభూమిలో ప్రచురితం అయినప్పటి నుండి వివిధ పత్రికలలో, సంకలనాలలో కవితలు, వ్యాసాలు చోటు చేసుకున్నాయి.'దృశ్యం', 'కనుమరుగు అయిపోతున్న మనిషి',

149

7