పుట:అక్షరశిల్పులు.pdf/149

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

అమితాబచ్చన్‌ కోసం రెండు ఎపిసోడ్లకు స్క్రిప్ట్‌ సమకూర్చారు. అమెరికా పెళ్ళి సంబంధాలు ప్రధానాంశంగా రాసిన నాటకం 'హెన్‌ కౌంటర్‌' రాష్ట్రంలో పలు ప్రదర్శనలకు నోచుకుంది. రచనలు: 1.కుట్ర (నవల), 2.కుతంత్రం (నవల). లక్ష్యం: అందిపుచ్చుకున్నవిజ్ఞానాన్ని పది మందితో పంచుకోవడం. చిరునామా: సికిందర్‌, ఇంటి నం. డి-12, సౌ త్‌ ఎండ్‌ పార్క్‌, ఎల్‌.బి నగర్‌, జి.ఎస్‌.ఐ పోస్టు, హైదారాబాద్‌-060. సంచారవాణి: 92473 47511. Email: sikanderwrites@rediffmail.com

సికిందర్‌ వి.
చిత్తూరు జిల్లా తిరుపతి నివాసి. వృత్తి : పాత్రికేయులు. వివిధ పత్రికలలో కవితలు, గేయాలు, వ్యాసాలు, మిని కథలు ప్రచురితం. చిత్తూరు నుండి వెలువడిన

'తెలుగు తేట' వారపత్రిక సంపాదకులుగా వ్యవహరించారు.

సిలార్‌ సాహెబ్‌ షేక్‌
ప్రకాశం జిల్లా కంబం శివారు మిట్టమీద పల్లె స్వగ్రామం. 1954లో 'మేఘ సందేశం' అను గ్రంథాన్ని వెలువరించారు.
సిలార్‌ వై ఎస్‌
కడప జిల్లా మర్రి మండలం శ్రీనివాసపురం జన్మస్థలం. తల్లితండ్రులు: మహబూబీ, ఎల్లటూరు పెద్ద సిద్దప్ప. రచనలు: బస్టాప్‌, సమాజంలో మరో సమిధ, వెట్టీచాకిరి,

చచ్చిపో, కుట్ర, నేను వేశ్యను కాను, సమాజంలో భారతీయం, మన మతం, విష బిందువులు, విలేఖరి, మార్పు, వారసులు, షిర్డీ సాయిబాబా (నాటకాలు).

సిరాజుద్దీన్‌ మహమ్మద్‌: వరంగల్‌ జిల్లా నర్సంపేట్ తాలూకా రంగాపురంలో 1953 డిసెంబర్‌ ఐదున జననం. తల్లితండ్రులు: మెహరున్నీసా బేగం, ముహమ్మద్‌ ఖాజా మోయినొద్దీన్‌. కలం పేరు: ముసి. చదువు: బి.ఏ. ఉద్యోగం: రెవిన్యూశాఖ (వరంగల్‌). 1973 నుండి రచనా వ్యాసంగం పట్ల ఆసక్తి కనపర్చినా 1990లో 'పరమపదసోపానం'

అక్షరశిల్పులు.pdf

కథ 'ఉదయం' లో ప్రచురితమైనప్పటినుండి వివిధ పత్రికల్లో,

కవితా సంకలనాల్లో కవితలు, కథలు చోటు చేసుకున్నాయి. రచనలు:1. ప్రపంచ శాంతి (కవితా సంపుటి,1995), 2.యుద్ధం (కవితా సంపుటి,2005). విశ్వశాంతి కోసం మానవాళి ఏం చేయాలన్న విషయం ప్రధానాంశంగా రూపొందిన 'ప్రపంచశాంతి పండుగ' కార్యచరణను సూచించడంతో ఐక్యరాజ్య సమితి ప్రశంసలు లభించాయి. 'మనిషెక్కడ ఉన్నాడు' 'విశ్వం నిండా విహరిద్దాం' కవితలు 'ఆద్మీ కహ హై', 'విశ్వభర్‌మే ఉడాన్‌ భరేంగే' శీర్షికన హిందీలోకి తర్జుమా చేయబడి హిందీ పత్రికలలో, సాహిత్య ఆకాడమీ (ఢిల్లీ) అధికారిక పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. ప్రపంచశాంతి దిశగా ప్రజలలో ఆలోచనలను రెకెత్తించడానికి సాగిస్తున్న రచనా వ్యాసంగం, అందుకు తగిన కార్యాచరణ

148