పుట:అక్షరశిల్పులు.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు


ప్రముఖ రచయిత డాక్టర్‌ బాగిల్‌ రాసిన 'డైలాగ్' (ఒక క్రైస్తవునికి ముస్లింలకు మధ్యన జరిగిన సంవాదం) ను తెలుగులోకి అనువాదం చేసి ప్రచురించారు. ఇస్లాం ధర్మం మీద వస్తున్న విమర్శలకు సమాధానంగా 2007లో 'పాపం-పరిహారం-రకణ' అను పరిశోధనాత్మక గ్రంథాన్ని స్వయంగా వెలువరించారు. 'సాదృశ్య మతధర్మాల సమీక్ష పై గ్రంథాలు ప్రచురించడం, సామాజిక, నైతిక, ధార్మిక, మానసిక రుగ్మతలకు సంబంధించిన సమస్యల మీద ధార్మికపరంగా పరిష్కారాలు సూచిస్తూ గ్రంథాలు రాయడం' తన ప్రధాన లక్ష్యమని ప్రకటించిన షిరాజ్‌ ఖాన్‌ 2009 ఆగస్టు 15న నెల్లూరులో కన్నుమూశారు. (సమాచారం : ఎం.ఏ.కె షిరాజ్‌ ఖాన్‌తో ఇంటర్వూ : 15-12-2008, నెల్లూరు)

సిద్దయ్య కవి ఎస్‌.
గుంటూరు జిల్లా తెనాలి తాలూకా అంగలకుదురు గ్రామంలో

1929 సెప్టెంబరు 29న జన్మించారు. చిన్నవయస్సులోనే మంచి

విద్వత్తును ప్రదర్శించిన ఆయన చాలా కాలం చిలకలూరిపేటలో

ఉన్నారు. చివరకు బిడ్డల ఉద్యోగాలరీత్యా నెల్లూరు వెళ్ళారు. స్యయంగా మంచి గాయకుడు. పలు సన్మానాలు, సత్కారాలను అందుకున్నారు. శ్రావ్యమైన కంఠతో పద్యగానం చేయడంలో సుప్రసిద్దులుగా ప్రజాభిమానం పొందారు. పలు గ్రంథాలను ప్రచురించారు. ఎక్కడ ఉన్నా తనదైన ముద్రతో సాహిత్య సౌరభాలను పంచుతూ కవిగా ప్రఖ్యాతిగాంచారు. రచనలు: అమరసింహుడు (పద్యా కావ్యం,1964), బుద్ద హృదయము (పద్యకావ్యము,1967), పతంగిని, రెడ్డిప్రభ, సుధీర, విజ్ఞాన భాస్కరం గ్రంథాలను వెలువరించారు.

సికిందర్‌
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో 1964 డిసెంబర్‌ ఏడున జననం.

తల్లితండ్రులు: షానవాజ్‌ బేగం, యం.వై మొహిద్దీన్‌. అసలు

పేరు : యం.బి మొహిద్దీన్‌. కలంపేరు: సికిందర్‌. చదువు:

బిఎస్సీ. వృత్తి: రచయిత-పాత్రికేయులు. 1980లో అపరాధ పరిశోధన మాసపత్రికలో ఒక డిటెక్టివ్‌ కథ రాయడం ద్వారా రచనా రంగ ప్రవేశం. అప్పటి నుండి అపరాధాపరిశోధన మాసపత్రికతో పాటుగా వివిధ పత్రికలలో కథలు, కవితలు, నవలలు, సీరియల్స్‌ ప్రచురితం అయ్యాయి. నైటింగేల్‌ ఎట్ మాస్క్‌' కవిత గుర్తింపు తెచ్చి పెట్టింది. 'ఆంధ్రభూమి' దినపత్రిక, 'ఈవారం' వారపత్రిక, 'సాక్షి' దినపత్రికల్లో ప్రసుతం పలు శీర్షికలు నిర్వహిస్తున్నారు. 'ఈటివి'లో వచ్చిన 'మార్గదర్శి' ప్రోగ్రాంలో హిందీ చలన చిత్ర నటుడు

147