పుట:అక్షరశిల్పులు.pdf/147

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

అక్షరశిల్పులు.pdf

'జీపొచ్చింది', 'రజాక్‌ మియా సేద్యM', 'పలక-పండగ', 'జుమ్మా' కథలు గుర్తింపు తెచ్చాయి. 'జుమ్మా' కథ (2007 మే, ఆదివారం ఆంధ్రజ్యోతి) ఆంగ్ల హిందీ, మైధులీ భాషాషా పత్రిక లలో ప్రచురితమై జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రాంతీయ కథల సరసన చేరింది. అఖిల భారత స్థాయిలో 'మ్యూజ్‌ ఇండియా' వెబ్‌సైటు నిర్వహించిన ప్రాంతీయ అనువాద కథల పోటీలలో 'జుమ్మా'కు ప్రత్యేక గుర్తింపు లభించింది. లక్ష్యం: పది మంది పది కాలాలపాటు గుర్తుంచుకునే కథలు రాయడం. చిరునామా : షేక్‌ మహమ్మద్‌ షరీఫ్‌, ఇంటి నం.13/303-ఇ4, గండిరోడ్డు, వేంపల్లె-516329, కడప జిల్లా. సంచారవాణి: 90102 14996. Email: shariffvempalli@gmail.com.

షరీఫ్‌ సాలార్‌ ఎం.: తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో 1938 జూలై ఐదున జన్మించారు. తల్లితండ్రులు: అమ్మాజీ, మహమ్మద్‌ హైస్సేన్‌, చదువు: ఎస్‌.ఎల్‌.సి. రాష్ట్ర ప్రభుత్వ సర్వే అండ్‌ లాండ్‌ రెవిన్యూ శాఖలో సర్వేయర్‌గా పనిచేసి, 1996లో ఉద్యోగ విరమణ చేశారు. ఆయన సోదరులు అహమ్మద్‌ అలీ (కాకినాడ) వెలువరించిన ఆధ్యాత్మిక ఆంగ్ల గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. అనువాదాలు: 1.సిలువే శరణ్యమా? 2.గీతా ప్రామాణిక వాస్తవాలు-ఖుర్‌అన్‌ దృక్కోణం, 3. ఫౌలు వాస్తవికత, 4. ఆ ప్రవక్త 5. మేధావుల సందేశాలకు సమాధానాలు. ఈ మేరకు పలు గ్రంథాలను అందించిన మహమ్మద్‌ సాలార్‌ షరీఫ్‌ 2006 డిసెంబరు 12న కాకినాడలో కన్నుమూశారు.

షాజిక్‌ మౌల్వీ 1938 లై నాి 'భారతి' లో 'ప్రాచీన అరబ్‌ నివాసులు హిందువులా?' వ్యాసం ప్రచురితం అయ్యింది.

షిరాజ్‌ ఖాన్‌ ఎం.ఏ.కె
1942 అక్టోబర్‌ 12న నెల్లూరు జిల్లా గూడూరులో హబీబ్‌
అక్షరశిల్పులు.pdf

ఖాన్‌, గౌసున్నీసాలకు జన్మించారు. అధ్యాపకులైన షీరాజ్‌ ఖాన్‌

1963 నుండి నాటికలు-నాటకాలు రాయడం ఆరంభించారు. ఆ క్రమంలో నిరంతరం రచనా వ్యాసాంగాన్ని కొనసాగించిన ఆయన రచనలు రాష్ట్రంలోని పలు పత్రికలో ప్రచురితం. ఆంగ్లం నుండి తెలుగులోకి, తెలుగు నుండి ఆంగ్లంలోకి పలు గ్రంథాలను తర్జుమా చేశారు.1982లో తొలిసారిగా 'శాంతి-ఓ-శాంతి' శీర్షికతో రాసిన వ్యాసాలు గీటురాయి వారపత్రికలలో ప్రచురితం అయ్యాయి. ఆ తరువాత గీటురాయిలో ధారావాహికంగా ప్రచురితమైన 'విశ్వసించిన వారే', 'ప్రళయం' వ్యాసాలు ఆయనకు ఖ్యాతి తెచ్చిపెట్టాయి.

146