పుట:అక్షరశిల్పులు.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు


షంషుద్దీన్‌ ముహమ్మద్‌
ఖమ్మం జిల్లా ఖమ్మం జన్మస్థలం. తల్లి తండ్రులు: లాల్‌బీ, మహబూబ్‌ అలీ. కలంపేరు: కౌముది. చదువు: సాహిత్యరత్న (హిందీ). ఉద్యోగం: హిందీ పండితులు. రచనలు: జ్వాలాపథం, సమాంతర రేఖలు, అమృత పథం, నల్ల

బంగారం, కళంకిని, విజయ, రంగభూమి, ధాన వంచిత, స్వేచ్ఛాపథం, అసిధారా, ఇంకా పలు సాహిత్య-సమీక్షా వ్యాసాలు, విమర్శలు, కవితలు ప్రచురితమయ్యాయి.

షంషుద్దీన్‌ షేక్‌
నెల్లూరు జిల్లా కలిచేడు లో 1973 జూలై ఐదున జననం. తల్లితండ్రులు: షేక్‌ జైబున్నీసా, షేక్‌ దాదా సాహెబ్‌. కలంపేరు: సూర్య షంషుద్దీన్‌. చదువు: బి.ఏ (మ్యాథ్స్‌)., డి.ఇ.ఇ.ఇ. వృత్తి:

ఉపాధ్యాయులు. తొలిసారిగా 2009లో 'ఎదురు చూపు' కవిత ప్రచురితం కావడంతో రచనా వ్యాసంగం ఆరంభమై అప్పటి నుండి వివిధ పత్రికలలో కవితలు, కథలు, వ్యాసాలు, వ్యంగ చిత్రాలు చోటు చేసుకున్నాయి. లక్ష్యం: సామాజిక రుగ్మతల నుండి సమాజానికి విముక్తి కల్గించేందుకు ప్రజలను చైతన్య వంతుల్నిచేయడం. చిరునామా: షేక్‌ షంషుద్దీన్‌, ఇంటి నం. 25/940, భక్తవత్సల నగర్‌, ఎన్‌.జీ.వో కాలనీ, ఏకె నగర్‌ (పోస్టు), నెల్లూరు-4, నెల్లూరు జిల్లా. సంచారవాణి: 92488 01257. Email: auryaschoolnellore@gmail.com

షరీఫా షేక్‌
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 1964 అక్టోబర్‌ ఒకిటిన జననం.

తల్లితండ్రులు: మస్తాన్‌ బీ, మస్తాన్‌ సాహెబ్‌. కలంపేరు: వెన్నెల.

చదువు: ఎం.ఏ. వృత్తి: ఉపాధ్యాయురాలు. 2001లో 'ఇస్లాంలో

స్త్రీ స్థానం' ధార్మిక వ్యాసం 'గీటురాయి' వారపత్రికలో ప్రచురితం. అప్పటి నుండి వివిధ పత్రికల్లో ప్రధానంగా ధార్మిక వ్యాసాలు, కథానికలు చోటు చేసుకున్నాయి. లక్ష్యం: ఇస్లాం సందేశాన్ని ప్రజలకు అందాజేయడం. చిరునామా: షేక్‌ షరీఫా, 39-3-19/ 3, మసీదాు వీధి, లబ్బీపేట, బందర్‌ రోడ్‌, విజయవాడ-10, కృష్ణా జిల్లా. సంచారవాణి: 94909 88786.

షరీఫ్‌ మహమ్మద్‌ షేక్‌
కడప జిల్లా వేంపల్లిలో 1980 ఏప్రిల్‌ 18న జననం. తల్లి తండ్రులు: నూర్జహాన్‌, షేక్‌ రాజా సాహెబ్‌. కలంపేరు: వేంపల్లి షరీఫ్‌. ఎస్‌.యమ్‌.డి

షరీఫ్‌. చదువు: బి.ఏ., బిపిఆర్‌., ఎంసిజె., ఎంఫిల్‌. ఉద్యోగం: సాక్షి టివి (హైదారాబాద్‌). 1999లో వార్తలో రాసిన 'పరిశీలన' కథతో ఆరంభమై వివిధ పత్రికలు, కవితా-కథా సంకలనాల్లో కథలు, కథానికలు, బాల సాహిత్య కథలు చోటు చేసుకున్నాయి. ఆ కథల్లో

145