పుట:అక్షరశిల్పులు.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

కొన్ని కవితలు ఇతర భాషల్లోకి తర్జుమా అయ్యి ఆయా భాషా పత్రికల్లో ప్రచురితమయ్యాయి. 'మైనార్టీ కవిత్వం-తాత్విక నేపథ్యం' శీర్షికతో 2005లో గ్రంథం వెలువడింది. రచనలు: 1.మైనార్టీ కవిత్వం-తాత్విక నేపథ్యం (1986 నుండి 98 దాకా వచ్చిన మైనార్టీ కవిత్వాన్ని విశ్లేషించి తాత్విక నేపథ్యాన్ని అంచనా వేసిన సిద్ధాంత గ్రంథం, 2005), 2. సుభాషిత ప్రభాసం (2008), 3. సూర్యోదయానంతరం (కవితా సంపుటి, 2010). అవార్డులు- పురస్కారాలు: రంజనీ-కుందుర్తి అవార్డు (హైదారాబాద్‌), కళాప్రపూర్ణ డాక్టర్‌ చిలుకూరి నారాయణ స్మారక అవార్డు (1996, అనంతపురం), ఆచార్య తూమాటి దోణప్ప పలనాడు పరిశోధన బంగారు పతకం (2002, అనంతపురం) ఉత్తమ కవి అవార్డు (2007, హిందూపురం). లక్ష్యం: సాహిత్యం ద్వారా సామాజిక చైతన్యం. చిరునామా: డాటర్‌ షేక్‌ షమీవుల్లా, ఇంటి నం.26-4-319, త్యాగరాజ నగర్‌, హిందూపురం-515201, అనంతపురం జిల్లా. సంచారవాణి: 94411 78415.

షంషీర్‌ అహ్మద్‌ షేక్‌
ప్రకాశం జిల్లా కురిచేడులో 1952 న్‌ 17న జననం. తల్లి తండ్రులు: మహబూబీ, షేక్‌ చత్తుమియా సాహెబ్‌. చదువు: ఎం.ఏ., గాంథియన్‌ ఎకనమిక్స్‌లో డిప్లొమా. ఉద్యోగం: రాష్ట్ర రెవిన్యూ శాఖలో 'అడిషనల్‌ జాయింట్ కలక్టర్‌'

(కృష్ణాజిల్లా). విద్యార్థి దశ నుండి కవిత్వం పట్ల ఆసక్తి చూపినా 1969లో విశాలాంధ్ర దినపత్రికలో 'కార్మిక కిరీటి' కవిత ప్రచురితమైంది. అప్పటినుండి రాసిన పలు కవితలు, గీతాలు, వ్యాసాలు వివిధ పత్రికల్లో, కవితా సంకలనాల్లో చోటు చేసుకున్నాయి. ఆయన

రాసిన గీతాల్లో 'జలక్రాంతి', 'అక్షర సంక్రాంతి', 'చింతలో నిశ్చింత'

ప్రబోధ గీతాల క్యాసెట్టుగా, 'షిర్థిసాయి సంకీర్తన మాల' భక్తిమాల క్యాసెట్ గా విడుదల అయ్యాయి. కవితల్లో 'గాలిగాడు', 'రక్తాన్ని కొలవకు', 'వికలాంతరంగులు' కవితలు గుర్తింపు తెచ్చిపెట్టాయి. పలు కవితలు ఇతర భాషల్లోకి అనువదించబడి ఆయా భాషా పత్రికల్లో ప్రచురితం రచనలు: 1. కెంపు గుండె (కవితా సంపుటి, 2005), 2. గానుగెద్దు రంకె (2007), 3. సచార కమిటీ నివేదిక- ఒక పరిశీలన (2008). పలు సాహిత్య- సాంస్కృతిక సంస్థల ద్వారా సన్మానాలు-సత్కారాలు అందాుకున్నారు. అవార్డులు-పురస్కారాలు: తెలుగు భాషా పురస్కారం (రాష్ట్ర అధికార భాషా సంఘం, 2009, హైదారాబాద్‌). లక్ష్యం: తెలుగు అధికార భాషగా సామాన్య ప్రజలకు చేరువయ్యేలా చేయాలన్నది. చిరునామా: షేక్‌ షంషీర్‌ అహమ్మద్‌, ఇంటి నం.6-260(6), మారుతీ నగర్‌, 2వ లైను, ఒంగోలు-523002, ప్రకాశం జిల్లా. సంచారవాణి: 9490409966.

144