పుట:అక్షరశిల్పులు.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

చేసే దిశగా కవిత్వం రాయాలన్నది నా లక్ష్యం' అని ప్రకించిన షేక్‌ అబ్దుల్‌ సలాం 2009 నవంబరు 8న కాకినాడలో కన్నుమూశారు. (సమాచారం : షేక్‌ అబ్దుల్‌ సలాం సోదరులు ఎం.ఎ. సాలార్‌, 10-10-2008, వినుకొండ, మరియు ఇండియా మాసపత్రిక, డిసెంబర్‌ 2009)

సలీం యం.ఏ
నల్గొండ జిల్లా నల్గొండలో 1945 న ఒకన జననం. తల్లితండ్రులు:
అమీనా బేగం, ఎం.ఏ రహీం. కలంపేరు
'దళిత్‌ సలీం'.

చదువు: యం.కాం., యల్‌యల్‌.బి. ఉద్యోగం: విశ్రాంత అధ్యాపకులు. తెలుగు, ఇంగ్లీషు పత్రికల్లో, సావనీర్‌లలో వ్యాసాలు ప్రచురితం. ఆంగ్లలోని ఉపయుక్త వ్యాసాలను, సమాచారాన్ని తెలుగులో అనువదించి వెలువరించడం పట్ల ఆసక్తి. లక్ష్యం: దళిత-బహుజన, మైనార్టీల ఐక్యత, అభివృద్థి కోసం రచయిత, వక్తగా నిరంతరం కృషిచేయడం. చిరునామా : ఎం.ఏ సలీం, ప్లాట్ నం. 405, ఇంటి నం. 14-1-426, ఆగాపురా, హైదారాబాద్‌-500 001. దూరవాణి : 040-2480 0134.

సలీం సయ్యద్‌: ప్రకాశం జిల్లా త్రోవగుంటలో 1961 జూన్‌ ఒకిటిన జననం. తల్లితండ్రులు: అన్ వర్‌ బీ, జాఫరుల్లా సాహెబ్‌. చదువు: యం.యస్సీ (టెక్‌). ఉద్యోగం: ఆదాయపన్ను శాఖలో డిప్యూటీ కమీషనర్‌ (హైదారాబాద్‌). కలం పేరు: సలీం. ప్రపథమంగా 1980లో రాసిన 'మనిషి' కథ ఆంద్రభూమిలోప్రచురితం. అప్పిటి నుండి పలు కథలు-

కథానికలు (160), కవితలు (120) వివిధ తెలుగు పత్రికలు,

కవితా సంకలనాలలో చోటు చేసుకున్నాయి. ఈ కథలలో కన్నడం (20), హిందీ (10), మరాఠీ (4), ఆంగ్ల (20) భాషల్లో అనువదించబడి ఆయా భాషా పత్రికలలో ప్రచురితం అయ్యాయి. చాల కవితలు పలు భాషల్లో వెలువడ్డాయి. రచనలు: 1. స్వాతి చినుకులు (1996), 2. నిశ్బబ్ద సంగీతం (1999), 3. రూపాయి చెట్టు (2004), 5. చదరపు ఏనుగు (2006), 6. రాణీగారి కథలు (2008) 7. ఒంటరి శరీరం (2009), కథా సంపుటాలు; 8. నీలోకి చూసిన జ్ఞాపకం (1999), 9. ఆకులు రాలే దృశ్యం (2005), కవితా సంపుటాలు; 10. జీవన సృతులు (2001), 11. వెండి మేషం (2003), 12. కాంచన మృగం (2004), 13. కాలుతున్న పూలతోట (2008), 14. 'ఓషన్‌ అండ్‌ అదార్‌ స్టోరీస్‌' (ఆంగ్లంలో కథాసంపుటి, 2010). నవలల్లో 'వెండి మేఘం' బహుళ పాఠకాదారణ పొంది హిందీ,

136