పుట:అక్షరశిల్పులు.pdf/136

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అక్షరశిల్పులు

సేకరణలో గడిపారు. ఆ విధాంగా సాగిన పరిశోధన పలితంగా 'కన్నెంగంటి హనుమంతు', 'పల్నాడు చరిత్ర' అను పరిశోధనాత్మక గ్రంథాలను రచించారు. పల్నాడు మీద అపార ప్రేమాభిమానాలు గల ఆయనను పల్నాడు చరిత్ర విషయంలో 'నడయాడు గ్రంథాలయం'గా పరిశోధకులు పరిగణించేవారు. సోనియా గాంధీ దేశీయత-విదేశీయత మీద ముమ్మరంగా చర్చ జరుగుతున్న సమయంలో 'సోనియా దేశీయత' గ్రంథాన్ని వెలువరించారు. ఈ గ్రంథంలో రాజ్యాంగాన్ని, దేశీ-విదేశీ చట్టాలను ఉటంకిస్తూ ముందుకు తెచ్చిన సాధికారిక వాదన ఫలితంగా 'సోనియావిదేశీయత ' చిన్నగ్రంథమైనా ప్రామాణిక మైనదిగా పరిగణించబడింది. ఆయన పరిశోధనాంశాలను అందరికి సులభంగా అర్థమయ్యే సరళమైన భాషలో వివరించడం మూలంగా, విద్యార్థులకు మాత్రమే కాకుండ సామాన్య పాఠకులకు, ప్రజలకు కూడా 'సలాం మాష్టారు'గా ఆయన చేరువయ్యారు. పరిశోధన, సాహిత్య కార్యక్రమాల నిర్వహకులకు వ్యయప్రయాసకోర్చి అన్నివిధాల చేదోడుగా నిలచిన ఆయనను సాహితీమిత్రులు, చరిత్ర పరిశోధకులు 'సాహితీ మహారాజు' అని ప్రేమగా పిలుచుకున్నారు. చివరిక్షణం వరకు రచనా వ్యాసాంగాన్ని, పల్నాడు మీద పరిశోధనలను కొనసాగిస్తూ ప్రజలకు, చరిత్ర పరిశోధకులకు, సాహిత్యాభిమానులకు, పాత్రికేయులకు, సాహితీ మిత్రులకు సమాచారపరంగా ప్రయోజనకరంగా నిలచిన షేక్‌ అబ్దుల్‌ సలాం గుంటూరు జిల్లా పిడుగురాళ్ళలో 2008 అక్టోబరు 10న కన్నుమూశారు. (సమాచారం: షేక్‌ అబ్దుల్‌ సలాం కుమారుడు షేక్‌ సిలార్‌, (జర్నలిస్ట్‌) 22-12-2008, నరసరావుపేట మరియు 'ఇండియా' మాసపత్రిక నవంబర్‌, 2008)

సలాం అబ్దుల్‌ షేక్‌
షేక్‌ అబ్దుల్‌ సలాం ప్రకాశం జిల్లా కరేడు గ్రామంలో 1948

జూలై ఒకటిన ఎంఎ.మజీద్‌, ఖాతూన్‌బీలకు జన్మించారు. బి.కాం చదివిన సలాం రాష్ట్ర ప్రభుత్వ పంచాయితీ రాజ్‌ ఇంజనీరింగ్ విభాగంలో వర్క్స్‌ ఇన్సెపెక్టర్‌గా ప్రకాశం జిల్లా

గుడ్లూరులో పదవీ విరమణ చేశారు. విద్యార్థిగా ప్రతి ఏడాది

అక్షరశిల్పులు.pdf

కళాశాల మ్యాగజైన్‌లలో కవితలు, వ్యాసాలు నాటికలు రాస్తూ తన రచనావ్యాసంగానికి శ్రీకారం చుట్టారు. 2001లో 'వార్త' దినపత్రికలో 'గురు పూజోత్సవం' శీర్షికతో ప్రచురితమైన కవితతో రచనా ప్రస్థానం ఆరంభమైంది. ఆనాటి నుండి కవిమిత్రుల నుండి లభించిన ప్రోత్సాహంతో షేక్‌ సలాం రాసిన కవితలు రాష్ట్రంలోని ప్రముఖ తెలుగు పత్రికలలో ప్రచురితం అయ్యాయి, రేడియోల్లో ప్రసారం అయ్యాయి. 'పిఎంకె.ఆర్ట్స్‌' (ఒంగోలు) సాంస్కృతిక సంస్థ ఆయనను 'కవిమిత్ర' పురస్కారంతో గౌరవించింది. 'మానవత మంట కలుస్తున్న నేటిసామాజిక పరిస్థితుల నుండి బయటపడే విధాంగా ప్రజలను చైతన్యవంతుల్ని

135