పుట:అక్షరశిల్పులు.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

ఆరంభించిన 'మాహి ' మాసపత్రికలో తొలిసారిగా చోటు చేసుకున్నాయి. 'కవాతు ' కవితాసంకలనంలో (2008) ప్రచురితమైన కవిత 'నీవెవరు?' గుర్తింపు నిచ్చింది. ప్రస్తుతం 'మలుపు' (2009) మాసపత్రికకు వహిస్తున్నారు. లక్ష్యం: బాధితప్రజలప కపక్వ్క్షం గా రచనలు-కార్యాచరణ . చిరునామా: సాజిదా సికిందర్‌, ఇంటి నం. 1-10-5/27, యస్‌.యస్‌ గుట్ట, మహబూబ్‌నగర్‌ - 509001, మహబూబ్‌నగర్‌ జిల్లా. సంచారవాణి: 98481 95084.

సలాం అబ్దుల్‌ షేక్‌
గుంటూరు జిల్లా తుమ్మల చెర్వులో షేక్‌ అబ్దుల్‌ సలాం

1938లో జన్మించారు. తల్లితండ్రులు: షేక్‌ మస్తాన్‌ సాహెబ్‌, షేక్‌ సిలార్‌బి. చదువు: ఎం.ఏ., ఎం.ఇడి., ఎల్‌ఎల్‌.బి. చిన్నతనం నుండి మేధావిగా పరిగణించబడి (ఆయనను పివి నరసింహారావు సిఫారస్సు మీద) ఢిల్లీలోని అడ్మిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కళాశాలలో అడ్మిషన్‌ పొందారు. ఆకస్మికంగా తండ్రి మరణించడంతో అందివచ్చిన అవకాశాన్ని వినియోగించు కోలేక పోయారు. తొలుత రాష్ట్ర హైకోర్టు ఉద్యోగంలో చేరి కొంత కాలం తరువాత స్వస్థలం వచ్చి ఉపాధ్యాయునిగా చేరి ప్రధానోపాధ్యాయునిగా 1972 వరకు పనిచేశారు. మంచి

సాహిత్యాభిలాషి. తెలుగు, ఆంగ్ల భాషలలో పట్టుగల వ్యక్తి.

రాజకీయాలు ప్రధానాంశంగా 'ఆధునిక భారతం' రచనను తొలుతగా చేశారు. ఆ తరువాత శ్రీశ్రీ సాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్న ఆయన 'చలం గారి శ్రీశ్రీ' అను పుస్తకాన్ని ప్రచురించారు. ఆ గ్రంథం ఆయనకు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది. ఈ గ్రంథాన్నిస్వయంగా 'శ్రీశ్రీ త్రూది ఐస్‌ ఆఫ్‌ చలం' పేరుతో ఆంగ్లంలోకి తర్జుమా చేశారు. ఈ రచన తరువాత రాష్ట్రంలోని శ్రీశ్రీ సాహిత్యాభిమానులు, ఆయనను 'పల్నాటి శ్రీశ్రీ' అని ప్రస్తావిస్తూ రావడంతో ఆయన పేరు 'పల్నాటి శ్రీశ్రీ' గా స్థిరపడింది. ఈ పుస్తకాన్ని చదివిన శ్రీశ్రీ ఆయనను ప్రశంసిస్తూ మద్రాసు నుండి 1981 డిసెంబరు 29న ఆంగ్ల దినపత్రిక ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో లేఖ రాశారు. ఆ తరువాత 1982 మే 22న సలాం రచనలను, ఆయన కృషిని కొనియాడుతూ శ్రీశ్రీ స్వయంగా లేఖ రాశారు. ఆంగ్లంలో 'ఐడియాస్‌ బిహైండ్‌ యాక్షన్స్‌' గ్రంథాన్ని వెలువరించారు. డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ తాత్విక భావజాలాన్ని సమీక్షిస్తూ మరో గ్రంథాన్ని వెలువరించారు. చివరిక్షణం వరకు సాహిత్యవ్యాసంగాన్ని కొనసాగిస్తూ, పల్నాడు చరిత్రమీద పరిశోధన చేస్తూ, చరిత్ర ప్రాధాన్యత గల ప్రతి అంశాన్ని పరికిస్తూ, ప్రతి ప్రాంతాన్నిసందర్శిస్తూ అనారోగ్యాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా సమాచార

134