పుట:అక్షరశిల్పులు.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు


రషీదా డి: కడప జిల్లా కడపలో 1962 జూలై ఒకిటిన జననం. తల్లితండ్రులు: ఖుర్షీద్‌

బేగం, సనావుల్లా ఖాన్‌. చదువు: హిందీ పండిట్. ఉద్యోగం:

ఉపాధ్యాయురాలు. 2006లో 'గీటురాయి' వారపత్రికలో రాసిన 'దెవకారుణ్య వర్థిని ' వ్యాసంతో ఆరంభించి పలుధార్మిక మహిళలో ధార్మిక చింతనను మరింతగా పెంపొందించాలన్న లక్ష్యంతో పత్రికలలో వ్యాసాలు, కదానికలు ప్రచురితం అయ్యాయి. 2009లో స్వీయ సంపాదకత్వంలో 'దైవ కారుణ్య వర్షిణి' అను త్రైమాసిక పత్రికను కడప కేంద్రంగా ఆరంభించి కొంతకాలం నడిపారు. లక్ష్యం: ఇస్లాం సందేశాన్నిసర్వవ్యాప్తం చేయడం. చిరునామా : డి. రషీదా, ఇంటి నం. 2/75, మారుతీనగర్‌, కడప-516001, కడప జిల్లా. దూరవాణి : 93463 73044.

రసూల్‌ ఖాన్‌ పఠాన్‌: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో 1982 మార్చి ఒకిటిన

జననం. తల్లితండ్రులు: పఠాన్‌ హసన్‌ బీబి, పఠాన్‌ ఖాశిం పీరా

ఖాన్‌. కలంపేరు. పి రసూల్‌ ఖాన్‌. చదువు: ఆరవ తరగతి. వ్యాపకం: ఆటోమెకానిక్‌. 2007లో మొదటిసారిగా రాసిన వ్యాసం 'మొక్కై వంగనిది' ప్రచురితమైనప్పటినుండి వివిధ పత్రికలలో వ్యాసాలు, కవితలు చోటుచేసుకున్నాయి. లక్ష్యం: ధర్మస్థాపన ప్రయత్నాలలో భాగంగా రచయితగా తగినంత భాగస్వామ్యాన్ని అందించడం. చిరునామా: పఠాన్‌ రసూల్‌ ఖాన్‌, తండ్రి: పఠాన్‌ ఖాశిం పీరా ఖాన్‌, పాండు పాత ఆసుపత్రి ఎదురు, కొనేి వీధి, యర్రగొండ పాలెం- 523327, ప్రకాశం జిల్లా. దూరవాణి: 9397076152.

రసూల్‌ ముహమ్మద్‌ షేక్‌: గుంటూరు జిల్లా అమరావతి మండలం మునుగోడులో

1993 సెప్టెంబర్‌ 15న జననం. కలంపేర్లు: అబూ అనస్‌,

బద్రుల్‌ ఇస్లాం. తల్లితండ్రులు: షేక్‌ ఇమాంబి, షేక్‌ బాన్‌సా. చదువు: బి.ఏ., ఎం.సి.ఏ., అరబ్బీ మాధ్యమంతో ఆలిమియత్‌, ఫజీలత్‌ చేశారు. తెలుగు, ఉర్దూ, హిందీ, అరబీ, ఆంగ్ల భాషల్లో ప్రవేశం. 2000లో 'అసూయ' గ్రంథాన్ని ఉర్దూ నుండి తెలుగులోకి అనువదించడంతో రచనా వ్యాసంగం అరంభమై. వివిధ పత్రికల్లో పలు ధార్మిక వ్యాసాలు చోటుచేసుకున్నాయి. ప్రచురణలు: ఉర్దూ, అరబీ భాషల నుండి తెలుగులోకి అనువదించిన 28 ధార్మిక

129