పుట:అక్షరశిల్పులు.pdf/129

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

వ్యాసాలు), 2006, 8. అపరాజిత (ఎయిడ్స్‌ బాధిత మహిళల యదార్థగాథలు), 2007, 9. ఎగరేసిన ఎర్రజెండా (భీమిరెడ్డి నరసింహారెడ్డి జీవిత కథనం), 2008, 10. నెల్లూరు బ్రౌన్‌ బంగోరె (బండి బాలగోపాలరెడ్డి జీవిత కథనం), 11. వాల్మీకి రామాయణం. 'తేజ' వారపత్రికలో 'మహతి' కలం పేరుతో సాహిత్య శీర్షిక నిర్వహణ. లక్ష్యం: ప్రజల్లో సాహిత్యాభిలాష, అభిరుచి కల్గించడం. చిరునామా: అబ్దుల్‌ రజా హుస్సేన్‌, ఇంటి. నం. 11-5-410, లిల్లీ బ్లాక్‌, ఫ్లాట్ నం.402, నయీంఖాశిం అపార్ట్‌మెంట్స్, రెడ్‌హిల్స్‌, హెదారాబాద్‌-500004, సంచారవాణి: 95055 17052, Email: a.rajahussain@gmail.com

రజాక్‌ అబ్దుల్‌ మొహమ్మద్‌: వరంగల్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం వెంకటాపూర్‌లో

అక్షరశిల్పులు.pdf

1966 మే 11న జననం. తల్లితండ్రులు: ఖాజాబీ, రాజ్‌

మహమ్మద్‌. చదాుదువు: బి.యస్సీ., బి.ఇడి., డి.జే. ఉద్యోగం: జర్నలిస్ట్‌. 1987 నుండి రచనా వ్యాసంగం ఆరంభం. వివిధ పత్రికలలో కవితలు, వ్యాసాలు ప్రచురితం. లక్ష్యం: గ్రామీణ ముస్లిం జీవన విధానం మీద పరిశోధానాత్మక వ్యాసాల ప్రచురణ. చిరునామా : మొహమ్మద్‌ అబ్దుల్‌ రజాక్‌, ఇంటి. నం.7-261087/ ఏ/134, రాజరాజేశ్వర్‌ నగర్‌ కాలనీ (బి.కె. గూడ), సనత్‌నగర్‌, హైదారాబాద్‌- 500038. సంచారవాణి: 99481 22798.

రమిజా బాను షేక్‌: నెల్లూరు జిల్లా బిట్రగుంటలో 1965 మార్చి మూడున జననం. తల్లితండ్రులు: హజిమా షేక్‌ సర్తాజ్‌ బేగం, హజీ షేక్‌ పీర్‌ అహమ్మద్‌. కలం పేరు: రమిజా. చదువు: ఎం.ఏ., బి.ఇడి. ఉద్యోగం: ఉపాధ్యాయురాలు. 1986లో 'హేతువాదం'

అక్షరశిల్పులు.pdf

మాసపత్రికలో (నరసరావుపేట) మూఢ నమ్మకాల వలన సమాజానికి కలిగే నష్టాలను వివరిస్తూ రాసిన వ్యాసంతో ఆరంభించి వివిధ పత్రికలలో వ్యాసాలు, సమీక్షలు ప్రచురితం అయ్యాయి. 'భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ముస్లిం మహిళలు నిర్వహించిన పాత్ర'ను వివరిస్తూ వివిధ పత్రికల్లో రాసిన వ్యాసాలు గుర్తింపు తెచ్చిపెట్టాయి. లక్ష్యం: సమాజాన్ని చైతన్యవంతం చేయటం-సర్వజనావళి ప్రగతికి రచనలు ఉపయుక్తం కావాలి. చిరునామా: షేక్‌ రమిజా బాను, శివప్రసాద్‌ వీధి, కొత్తపేట, వినుకొండ-522647. గుంటూరు జిల్లా. దూరవాణి: 94413 70070.

రషీద్‌ బాషా: నెల్లూరు నివాసి. ఇస్లాం మంతంలోని పండుగల మీద 'విక్రమ సింహపురి మండల సర్వస్వం'లో వ్యాసాలు రాశారు.

128