పుట:అక్షరశిల్పులు.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు

నూర్జాహాన్‌ షేక్‌: పశ్చిమ గోదావరి జిల్లా పండిత వెల్లూరులో 1969 మే 11న జననం. తల్లితండ్రులు: అమీనా బీబి, మీరా సాహెబ్‌. కలంపేరు:

బాబ్జీ. చదువు: యం.ఏ., బి.ఇడి. ఉద్యోగం: ఉపాధ్యాయులు. 1984లో 'నడుస్తున్న చరిత్ర' మాసపత్రికలో తొలిసారిగా కవిత ప్రచురితమైనప్పి నుండి వివిధ పత్రికల్లో, సంకలనాల్లో కవితలు చోటు చేసుకున్నాయి. పలు గేయ రూపకాలు విద్యార్థుల ద్వారా ప్రదర్శించ బడ్డాయి. సాహిత్యసంస్థలద్వారా సన్మానాలు -సత్కారాలు. లక్ష్యం: సామాజిక రుగ్మతల పట్ల ప్రజలలో చైతన్యం కలించుట. చిరునామా: షేక్‌ నూర్జాహాన్‌, ఇంటి.నం. 3-286-14, శ్రీ సాయిదాుర్గా నగర్‌, పాలంగి-534216, పశ్చిమగోదావరి జిల్లా.

నూరుల్లా ఖాద్రి సయ్యద్‌: ఉర్దూ మున్షీ, కర్నూలు. రచనలు: రమజాను మహిమలు, నమాజు బోధిని, సుందరమగు నమూనా, విశ్వాసములు, ఆరు మాటలు, జుంబా.

పాపా సాహెబ్‌ తక్కెళ్ళపల్లి: అనంతపురం జిల్లా గుత్తి తాలూకా అప్పేచర్ల జన్మస్థలం. తల్లి తండ్రులు: ఫక్రూబీ, ఫక్రుద్దీన్‌. 1928లో జననం. రచనలు: అవధి, అంబ, కన్నీటి చుక్కలు, ప్రేమ విలాసము, రసఖండం, రాణీ సంయుక్త, శకుంతల, సత్యాంవేషణము, పాపాసాబు మాట పైడిమూట.

పర్వీన్‌ ముస్తఫా: కరీంనగర్‌ జిల్లా గోదావరిఖనిలో 1974 సెప్టెంబర్‌ 25న జననం. తల్లితండ్రులు: రజియా బేగం, మొహమ్మద్‌ ఖాశిం సాహెబ్‌. కలంపేరు: కిరణకాంతి. చదువు: బి.ఏ. 2007 ఏప్రిల్‌లో 'నమాజ్‌ ప్రాముఖ్యత' వ్యాసం ప్రచురితమైనప్పటినుండి వివిధ పత్రికల్లో పలు ఆధ్యాత్మిక వ్యాసాలు చోటుచేసుకున్నాయి. లక్ష్యం: సత్య సందేశాన్ని ప్రజలకు అందించడం. చిరునామా: పర్వీన్‌ ముస్తఫా, ఇంటి నం.607 /డిబి, పంజాబ్‌ గడ్డ, రామవరం, కొత్తగూడెం-507118, ఖమ్మంజిల్లా. సంచారవాణి: 92927 50406.

పిరాన్‌ నిజాయి టె.హెచ్‌: రచనలు: హజరత్‌ హుస్సేన్‌ సంస్మరణము, సూరయె ఫాతెహా (అనువాదం) హజ్రత్‌ ముహమ్మద్‌ సల్లల్లాహం అలైహి వస్సలాం గారి సీరత్‌ గురించి ఉపన్యాసములు (అనువాదాలు).

ఖుతుబుద్దీన్‌ సయ్యద్‌ డాక్టర్‌: హైదారాబాద్‌ ఫలక్‌నుమ ఖాద్రిచమన్‌లో 1945 మే15న జననం. తల్లితండ్రులు: సయ్యదా నూరాం బీ, సయ్యద్‌ మహబూబ్‌ అలీ. కలంపేరు: కుతుబ్‌ సర్‌షార్‌. చదువు: ఎం.ఏ., పి.హెచ్‌డి. ఉద్యోగం: విశ్రాంత అధ్యాపకులు. 1973లో 'నిర్మాణం' (మహబూబ్‌నగర్‌) పత్రికలో 'వికృత సత్యాలు' (కవిత) రాసినప్పటి నుండి వివిధ

121