పుట:అక్షరశిల్పులు.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

నిసార్‌ అహమ్మద్‌ సయ్య: కర్నూలు జిల్లా ఆదోనిలో 1979 సెప్టెంబర్‌ 30న జననం. తల్లితండ్రులు: సయ్యద్‌ రహమత్‌, సయ్యద్‌ యానిన్‌

మియా. కలంపేరు: ఎండి. రహమత్‌. చదువు: ఎం.ఏ., పి.ఏడి.వృత్తి: పాత్రికేయులు. గత దశాబ్దంగా వివిధ పత్రికల్లో బాధ్యతలునిర్వహిస్తూ వ్యాసాలు రాసినా 2007 నుండి 'గీటురాయి'వారపత్రికలో వరుసగా వ్యాసాలు ప్రచురితం అయ్యాయి. అప్పటినుండి సమకాలీన సమస్యల మీద ఇతర పలు సామాజికఅంశాల మీద వివిధ పత్రికలలో వ్యాసాలు చోటుచేసుకున్నాయి.

ఆ వ్యాసాలలో గీటురాయిలో వచ్చిన 'అల్లరి మూకలకు శిక్షేది?' గుర్తింపు తెచ్చింది. లక్ష్యం: జాతిజనుల చైతన్యం. చిరునామా: సయ్యద్‌ నిసార్‌ అహమ్మద్‌, జర్నలిస్ట్‌, ఇంటి నం.1-1-300/17, అశోక్‌నగర్‌, 12వ వీధి, హైదారాబాద్‌ -20. సంచారవాణి: 97001 42615.Email: nisarahamedsyed@gamil.com

నిసార్‌ యం.డి: నల్లగొండ జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలో 1962 డిసెంబర్‌ 16న జననం. కలం పేరు: నిసార్‌. తల్లితండ్రులు: హలీమాబీ, మహమ్మద్‌ అబ్బాస్‌. చదువు: బి.ఏ. వృత్తి: ఆర్టీసి ఉద్యోగి. 1986లో 'ప్రజా రచయితల సమాఖ్య'లో

చేరినప్పటి నుండి పాటలు రాయడం, పాడడం, ఆడడం ఆరంభమైంది. 'ఆంధ్ర ప్రజా నాట్యమండలి'తో సంబంధాలు ఏర్పడ్డాక కవితలు, పాటలు, పల్లె సుద్ధులు రాయడం, పాడడం, ప్రదర్శనలు ఇవ్వడం విస్తృతంగా జరిగింది. 'పల్లెసుద్దుల' మీద ప్రత్యేక కృషి చేసి సమకాలీన ప్రజా సమస్యల మీద తయారు చేసిన ప్రత్యేక కార్యక్రమాలను స్వయంగా దర్శకత్వం వహించి ఆడుతూ పాడుతూ రాష్ట్ర పరిదుల్ని దాటిజాతీయ స్థాయి కార్యక్రమాలలో భాగంగా ఢిల్లీ, లక్నో, మద్రాసులలో ప్రదర్శనలు ఇచ్చారు. ఈ క్రమంలో రాసిన పాటలు, కవితలు, గేయాలు, కథానికలు వివిధ పత్రికల్లో, సంకలనాల్లో, రాష్ట్రంలోని పలు ఉద్యమ పత్రికల్లో పెక్కు సంఖ్యలో చోటుచేసుకున్నాయి. అభ్యుదయ చలనచిత్రాలకు పాటలు రాశారు, ఆయా చిత్రాలలో నటించారు. రచనలు: నిసార్‌ పాట (పాటల సంపుటి, 2009), నిసార్‌ పాటల క్యాసెట్టు (ఎంపిక చేసి నిసార్‌ స్వయంగా గానం చేసిన పాటలు, 2009). లక్ష్యం: అవినీతికి, అసమానతలకు దూరంగావివక్షారహిత మానవీయ సమాజాన్ని ఆకాంక్షిస్తూ వాగ్గేయకారునిగా నిరంతరం ప్రజల్లో బతకాలని. చిరునామా: ఎండి. నిసార్‌, ఇంటి నం. 4-52-169, మగ్దూం నగర్‌, జగద్గిరి గుట్ట, బాలనగర్‌, హైదారాబాద్‌-37. సంచారవాణి: 9490952285.

120