పుట:అక్షరశిల్పులు.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

చిన్నతనం నుండి సంగీతం పట్ల మక్కువ చూపిన నాజర్‌ నాటకాలు, నాటికలు రచిస్తూ, నటిస్తూ తొలుత గ్రామ ప్రజల మన్నన పొందారు. ఆ తరువాత నాట్యం, నటనను నేర్చుకున్న ఆయన ప్రజా నాట్యమండలి సభ్యుడిగా బుర్రకథను ప్రచార సాధానంగా స్వీకరించి బుర్రకథ కళాకారుడిగా స్థిరపడ్డారు. ఈ క్రమంలో జీవితాంతం బుర్రకథను ప్రదర్శిస్తూ, ఆ కళారూపానికి ప్రాణం పోసి 'బుర్రకథ పితామహుడు' గా ప్రజల పురస్కారాన్నిఅందుకున్నారు. జానపద కళలను బాగా అధ్యయనం చేసిన నాజర్‌ 'బెంగాల్‌ కరువు', 'రాయలసీమ కరువు' లను బుర్రకథలుగా మలచి తన అద్బుత గానంతో, అద్వితీయ నటనతో ప్రజలను ఉర్రూతలూగించే విధంగా బుర్రకథలను చెబుతూ ప్రాంతీయ స్థాయి నుండి జాతీయ స్థాయికి చేరుకున్నారు. ఆ తరువాత 'పల్నాటియుద్ధం' 'బొబ్బిలి యుద్ధం' 'వీరాభిమన్యు' చారిత్రక ప్ధరాణిక కథలను బుర్రకథలుగా రాశారు. 'ఆసామి' అను సాంఫిుక నాటకాన్ని, 'నా చేతిమాత్ర' ఏకపాత్రాభినయం, 'భక్త ప్రహ్లాద' యక్షగానం, రూపొందించారు. ఆయన రూపొందించిన వివిధ సాహిత్య ప్రక్రియలకు, జానపద కళా

రూపాలకు చెందిన రచనలకు సుమదుర గాత్రం అందించటమే

కాకుండా ఆయన స్వయంగా నటించారు. ప్రజా కళాకారుడిగా ప్రజా హృదయాలను చూరగొన్న ఆయనను 1986లో 'పద్మశ్రీ' అవార్డు వరించింది. ఆనాటికి మరే జానపద కళాకారుడికి అంత గౌరవం దక్కకపోవడంతో జానపద కళాకారులలో 'పద్మశ్రీ' అవార్డు అందుకున్న తొలి జానపద కళాకారునిగా ఆయన చరిత్ర సృష్టించారు. జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖుల, ప్రముఖ సాహిత్యసంస్థల ప్రసంశలుపురస్కారాలు అందుకున్నారు. బుర్రకథకు పర్యాయపదంగా మారిన పద్మశ్రీ షేక్‌ నాజర్‌ సాహెబ్‌ చలన చిత్రాలలో నటించడమే కాకుండా 'నిలువుదోపిడి', 'పెత్తందార్లు', 'సగటు మనిషి', చిత్రాలకు రచనా సహకారం అందించారు. ఆయన సాహిత్యం, కళాజీవితం మీద అంగడాల వెంకట కృష్ణమూర్తి పరిశోధన చేసి సిద్ధాంత వ్యాసం సమర్పించి ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం (గుంటూరు) నుండి 'పి.హెచ్‌డి' పట్టా పొందారు. పద్మశ్రీ నాజర్‌ జీవిత చరిత్ర 'పింజారి' పేరుతో ముద్రితమైంది. 'జాతి జీవితం -కళాపరిణామం' పేరుతో ఆయన రాసిన పరిశోధానాత్మక గ్రంథం 1997లో ప్రచురితమైంది. ఆయన స్వయంగా రాసుకున్న 'ఆత్మకథ' ముద్రణకు నోచుకోకుండానే పద్మాశ్రీ షేక్‌ నాజర్‌ సాహెబ్‌ 1997 ఫిబ్రవరి 21న గుంటూరులో కన్నుమూశారు. (సమాచారం: షేక్‌ నాజర్‌ భార్య శ్రీమతి ఆదాంబి, కుమారుడు, బుర్రకథ కళాకారుడు షేక్‌ బాబూజీలతో ఇంటర్వూ, 06-06-2008, గుంటూరు)

118