పుట:అక్షరశిల్పులు.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

మౌలా షేక్‌ మున్షీ: 1892లో ప్రచురితమైన 'చింతామణి' పత్రికలో 'నీతివాక్య రత్నాకరం' శీర్షిక వ్యాసం ప్రచురితం.

మహమూద్‌ అలీ ఖాన్‌ కాట్లగల్‌: అనంతపురం జిల్లా కదిరి గ్రామంలో 1962

జూలై ఒకిటిన జననం. తల్లితండ్రులు: కె. జైబున్నీసా, కె. ఫరీద్‌ ఖాన్‌. చదాుదువు: ఎం.ఏ (లిట్). వృత్తి: ఉర్దూ ఉపాధ్యాయులు. తెలుగు, ఉర్దూ భాషలో ప్రవేశం. 1988లో 'ఆవేదన చెందుతున్నబస్సు' కవిత ప్రచురితం కావడం ద్వారా రచనా రంగప్రవేశం. అప్పటినుండి కవితలు, వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురితం. లక్ష్యం: సామాజిక స్పృహను, మానవతా విలువలను మరింతగా పెంచడం. చిరునామా: కాట్లగట్ల మహమూద్‌ అలీ ఖాన్‌, రజ్విప్రిన్స్‌ ప్యాలెస్‌, ఇంటి నం.12-55-8, మున్సిపల్‌ కార్యాలయంరోడ్‌, కదిరి-515591, అనంతపురం జిల్లా.

మహమ్మద్‌ ఖాన్‌: కృష్ణాజిల్లా అలీ నగరంలో 1952 జనవరి ఐదున జననం. తల్లి

తండ్రులు: రహీమున్నీసా, మహమ్మద్‌ వారిస్‌ ఖాన్‌. చదువు:

బి.ఏ. ఉద్యోగం: విశ్రాంత ఉద్యోగి. 1976లో విద్యార్థిగా రాసిన కవిత ప్రచురితమైనప్పటి నుండి వివిధ పత్రికలలో, సంకలనాల్లో పలు కవితలు చోటు చేసుకున్నాయి. అవార్డులు: జ్వాలాముఖి అవార్డు (ఆంధ్ర సాంస్కృతిక సమాఖ్య, విజయవాడ, 2009), పోలవరపు కోటేశ్వరరావు అవార్డు (ఆంధ్ర ఆర్ట్స్‌, విజయవాడ, 2009), శ్రీశ్రీ పురస్కారం (కళాదార్బార్‌, రాజమండ్రి). రచనలు: కెరటాలు (కవితా సంపుటి, 2010), సప్తస్వరాలు (హైకూలు, 2010). చిరునామా: మహమ్మద్‌ ఖాన్‌, ఇంటి నం.11-161, స్రవంతి హైస్కూలు రోడ్‌, గన్నవరం-521101, కృష్ణా జిల్లా. సంచారవాణి: 94401 37475.

ముజీర్ సయ్యద్: గుంటూరు జిల్లా బాపట్లలో 1939 జూలై ఒకిటిన జననం. చదువు: బి.ఎస్సీ., బిఏ., డిఐపి., డిఐ.టెక్నాలజీ. ఉద్యోగం: అధ్యాపకులు (రిటైర్డ్‌). 1962 నుండి ఉర్దూ, ఆంగ్లం, తెలుగులో రాసిన కవితలు, సాహిత్య వ్యాసాలు, గేయాలు, అనువాదాలు ఆయా భాషా పత్రికలలో ప్రచురితం. రచనలు: రాగపరాగాలు (గేయసంపుటి, 1980). లక్ష్యం: మానవతావాద ప్రచారం. చిరునామా: సయ్యద్‌ మజీర్‌, అల్‌ ముజీర్‌ సయ్యద్‌

110